తెలంగాణ

telangana

ETV Bharat / sports

KKR మెంటార్​ రేస్​లో వరల్డ్​కప్ విన్నింగ్ కెప్టెన్- హింట్ కూడా ఇచ్చారుగా! - IPL 2025 - IPL 2025

KKR New Mentor 2025: డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్ నుంచి గంభీర్ దూరమవడం వల్ల ఆ జట్టు మెంటార్​గా ఎవరు వస్తారన్నది ఆసక్తిగా మారింది. అయితే ఆ పోస్టుకు దిగ్గజ క్రికెటర్ పేరు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

KKR New Mentor 2025
KKR New Mentor 2025 (Source: Getty Images)

By ETV Bharat Sports Team

Published : Sep 12, 2024, 11:16 AM IST

KKR New Mentor 2025:మాజీ క్రికెటర్ గౌతమ్​ గంభీర్ టీమ్ఇండియా హెడ్ కోచ్​గా బాధ్యతలు స్వీకరించడం వల్ల ఐపీఎల్​లో కోల్​కతా నైట్​రైడర్స్ మెంటార్ పోస్ట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 2024 సీజన్​లో జట్టును సరైన మార్గంలో నడిపించిన గంభీర్, కేకేఆర్ ఛాంపియన్​గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇటీవల అతడు టీమ్ఇండియా కోచ్​గా వెళ్లడం వల్ల కేకేఆర్ జట్టుకు గుడ్​బై చెప్పాడు.

దీంతో ఆ ప్లేస్​ను సరైన సరైన వ్యక్తితో భర్తీ చేయాలని కేకేఆర్ యాజమాన్యం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ జాక్వెస్ కలీస్​తో మేజేజ్​మెంట్ సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. అయితే తాజాగా ఈ పోస్ట్​ కోసం మరో పేరు రేస్​లోకి వచ్చినట్లు తెలుస్తోంది. వరల్డ్​కప్ విన్నింగ్ కెప్టెన్, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్​ మెంటార్​గా ఎంపికయ్యే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. కేకేఆర్ మేనేజ్​మెంట్ ఇప్పటికే వీరిద్దరి పేర్లు షార్ట్​లిస్ట్​ చేసిందట. వీళ్లలోనే ఒకరు కేకేఆర్ కొత్త మెంటార్​గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.

పాంటింగ్ హింట్!
అయితే రికీ పాంటింగ్ 2025 ఐపీఎల్​ గురించి ఓ మ్యాచ్ ప్రజెంటేషన్​లో హింట్ ఇచ్చాడు. వచ్చే సీజన్​కు పలు ఫ్రాంచైజీల నుంచి అవకాశాలు వస్తున్నట్లు చెప్పాడు. 2025లో మళ్లీ తనను ఐపీఎల్​లో చూసే ఛాన్స్ ఉందంటూ హింట్ ఇచ్చాడు. '2025 ఐపీఎల్​ కోసం పలు ఫ్రాంచైజీల నుంచి నాకు ఆఫర్స్ వస్తున్నాయి. ఏం జరుగుతుందో కొన్ని వారాల్లోనే తెలిసిపోతుంది' అని పాంటింగ్ అన్నాడు.

కాగా, పాంటింగ్​ను దిల్లీ క్యాపిటల్స్ ఇటీవల వదులుకుంటున్నట్లు ప్రకటించింది. గతంలో 2018 నుంచి 2023 దాకా పాంటింగ్​ దిల్లీకి మెంటార్​గా వ్యవహరించాడు. ఇక అతడిని ఇటీవల దిల్లీ యాజమాన్యం ఆ బాధ్యతల నుంచి తప్పించింది. అటు దిల్లీ కూడా పాంటింగ్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయనున్నారన్నది ప్రకటించలేదు. అయితే 2008 ప్రారంభ సీజన్​లో పాంటింగ్ కేకేఆర్​ జట్టుకే ఆడాడు. అతడు 4 మ్యాచ్​ల్లో కోల్​కతాకు ప్రాతినిధ్యం వహించాడు.

2025 ఐపీఎల్ మెగా వేలంలో ఆ ముగ్గురికి జాక్ పాట్! రూ. కోట్లు ఇచ్చి దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఇంట్రెస్ట్​! - 2025 IPL Mega Auction

ముంబయితో రోహిత్, SRHతో భువీ జర్నీ ఓవర్?- ఇక ఫ్రాంచైజీ మారడం పక్కా! - Rohit Sharma Mumbai Indians

ABOUT THE AUTHOR

...view details