తెలంగాణ

telangana

ETV Bharat / sports

దంచేసిన 'డూప్లెసిస్'- ఆర్సీబీ నాలుగో విజయం- గుజరాత్ చిత్తు - IPL 2024

RCB vs GT IPL 2024: బెంగళూరు చిన్నస్వామి వేదికగా గుజరాత్​తో జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో ప్రస్తుత సీజన్​లో ఆర్సీబీ నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుంది.

RCB vs GT IPL 2024
RCB vs GT IPL 2024 (Source: ANI)

By ETV Bharat Telugu Team

Published : May 4, 2024, 10:52 PM IST

RCB vs GT IPL 2024:2024 ఐపీఎల్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో విజయం నమోదు చేసింది. శనివారం చిన్నస్వామి వేదికగా గుజరాత్ టైటాన్స్​తో తలపడ్డ ఆర్సీబీ 4 వికెట్ల తేడాతో నెగ్గింది. గుజరాత్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ (64 పరుగులు, 23 బంతుల్లో; 10x4, 3x6) మెరుపు హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దినేశ్ కార్తిక్ (21*) రాణించాడు.

6 ఓవర్లకే 92
148 పరుగుల ఛేదనలో ఆర్సీబీ ఓపెనర్లు విరాట్ కోహ్లీ (42), ఫాఫ్ డూప్లెసిస్ (64) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ పోటాపోటీగా బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డూప్లెసిస్ మాత్రం గుజరాత్ బౌలర్లపై దండయాత్ర చేశాడు. ఈ క్రమంలో 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆరో ఓవర్లో సిక్స్​, ఫోర్ బాది తర్వాత బంతికి జోషువా బౌలింగ్​లో క్యాచౌట్​గా వెనుదిరిగాడు. దీంతో 92 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. అలాగే పవర్ ప్లే లోనే 92 పరుగుల స్కోర్ నమోదైంది.

వికెట్లు టపటపా
డూప్లెసిస్ ఔటైన తర్వాత ఆర్సీబీ బ్యాటర్లు వరుసగా పెవిలియన్​కు క్యూ కట్టారు. విల్ జాక్స్ (1), రజత్ పాటిదార్ (2), గ్లెన్ మ్యాక్స్​వెల్ (4), కామెరూన్ గ్రీన్ (1), విరాట్ కోహ్లీ (42) ఔటయ్యారు. దీంతో 24 పరుగుల వ్యవధిలో ఆర్సీబీ 5 వికెట్లు కోల్పోయింది. ఇక చివర్లో దినేశ్ కార్తిక్ (21*), స్వప్నిల్ సింగ్ (10*) బెంగళూరు విజయాన్ని ఖాయం చేశారు.

జోషువా లిటిల్@4:గుజరాత్ యంగ్ బౌలర్ జోషువా లిటిల్ ఆర్సీబీ టాపార్డర్​ను కుప్పకూల్చాడు. ఏకంగా 4 కీలక వికెట్లు పడగొట్టి ఔరా అనిపించాడు. అతడు డూప్లెసిస్, రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్​వెల్, గ్రీన్​ను పెవిలియన్​ చేర్చాడు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు శుభ్​మన్ గిల్(2), వృద్ధిమాన్ సాహ (1) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. ఆర్సీబీ పేసర్ మహ్మద్ సిరాజ్ రెండో ఓవర్లోనే సాహాను ఔట్ చేసి గుజరాత్ వికెట్ల పతనాన్ని ప్రారంభించాడు. తన రెండో ఓవర్లో గిల్​ను కూడా క్యాచౌట్​గా పెవిలియన్ చేర్చాడు. ఇక యంగ్ ఆల్​రౌండర్ కామెరూన్ గ్రీన్, వన్​డౌన్​లో వచ్చిన సాయి సుదర్శన్​ను వెనక్కి పంపాడు. దీంతో పవర్ ప్లేలోనే గుజరాత్ 3 కీలక వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత వచ్చిన షారుక్​ ఖాన్ (37 పరుగులు), డేవిడ్ మిల్లర్ (30 పరుగులు), రాహుల్ తెవాటియా (35 పరుగులు) రాణించారు. చివర్లో రషీద్ ఖాన్ (18 పరుగులు) ఫర్వాలేదనిపించాడు. దీంతో గుజరాత్ స్కోర్ 140+ దాటింది. ఇక ఆఖర్లో విజయ్ శంకర్ (10 పరుగులు) విఫలమవ్వడం వల్ల గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. ఆర్సీబీ బౌలర్లలో సిరాజ్, యశ్ దయాల్, విజయ్ కుమార్ తలో 2, గ్రీన్, కర్ణ్ శర్మ చెరో 1 వికెట్ దక్కించుకున్నారు.

విరాట్​ ముంగిట మరో రికార్డ్- ఏకైక ప్లేయర్​గా నిలిచే ఛాన్స్! - IPL 2024

ముంబయిపై కోల్​కతా విజయం - 12ఏళ్ల తర్వాత తొలిసారి! - IPL 2024

ABOUT THE AUTHOR

...view details