IPL 2024 FINED:2024 ఐపీఎల్లో స్లో ఓవర్ రేట్లు కూడా రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దాదాపు ప్రతి రెండు లేదా మూడు మ్యాచ్‌ల్లో ఒక కెప్టెన్ జరిమానాకు గురవుతున్నాడు. తాజాగా ఆదివారం నాటి వేర్వేరు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరన్ జరిమానా భారిన పడ్డారు. ఈ కెప్టెన్లు ఇద్దరు ఆదివారం నాటి వేర్వేరు మ్యాచ్‌ల్లో ఐపీఎల్ మోడల్ కండక్ట్ (IPL Code of Conduct) కోడ్ ఉల్లఘించినట్లు బోర్డు పేర్కొంది. దీంతో వీరిద్దరికీ ఫైన్ విధిస్తున్నాట్లు ఐపీఎల్ బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆదివారం బెంగళూరు- కోల్‌కతా మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆర్సీబీ కెప్టెన్ డూప్లెసిస్‌కు బోర్డు రూ.12 లక్షల జరిమానా విధించింది. కాగా, ఆర్సీబీ కెప్టెన్ ఈ సీజన్లో స్లో ఓవర్ రేట్‌కు గురవడం ఇదే తొలిసారి. మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరన్‌కు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధించారు. పంజాబ్- గుజరాత్ మ్యాచ్‌లో సామ్ కరన్ అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
గుజరాత్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో కరన్ డిఫెన్స్ చేస్తుండగా బంతి ప్యాడ్స్‌ను తాకింది. దీంతో గుజరాత్ బౌలర్లు అప్పీల్ చేయగా అంపైర్ కరన్‌ను ఔట్‌గా ప్రకటించాడు. ఇక ఎల్బీడబ్ల్యూగా కరన్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. అయితే కరన్ అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. తాను నాటౌట్ అంటూ కాసేపు వాదించాడు. దీంతో అతడిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొంది.