iPhone Fast Charging Tips : ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులందరికీ అతిపెద్ద సమస్య బ్యాటరీ ఛార్జింగ్ స్పీడ్. అందులో ఐఫోన్ వినియోగదారులకు ఈ సమస్య కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఐఫోన్ ఛార్జ్ చేయడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. అర్జెంట్‌గా బయటకు వెళ్లాల్సి వచ్చినా, ఏదైనా ఫంక్షన్స్ లేదా టూర్స్‌కు ఇలా వెళ్లినప్పుడు ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు ఐఫోన్‌ను చాలా వేగంగా ఛార్జ్ చేయవచ్చు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పాత ఛార్జర్‌ను అప్‌గ్రేడ్ చేయాలి
పాత ఛార్జర్‌తో ఐఫోన్‌ను ఫుల్‌గా ఛార్జింగ్ చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకోసం 20 వాట్ ఛార్జింగ్ సామర్థ్యం గల అడాప్టర్‌కు యూఎస్బీ-సీ టు లైటెనింగ్ లేదా యూఎస్బీ-సీ టు యూఎస్బీ-సీ కేబుల్‌తో ఉపయోగించాలి. ఇలా చేస్తే ఐఫోన్ 8, ఆ తర్వాత వచ్చిన మోడల్స్ 50శాతం ఛార్జింగ్‌ను కేవలం 30 నిమిషాల్లో ఛార్జ్ చేయొచ్చు. టైమ్ ఉంటే గంటలో ఫుల్ ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. తక్కువ సమయం ఉన్నప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అయితే, ప్రస్తుతం యాపిల్ కంపెనీ ఐఫోన్‌తో పాటు కేవలం కేబుల్ మాత్రమే ఇస్తోంది. పవర్ అడాప్టర్‌ను వేరుగా కొనాల్సిందే. 20 వాట్ సామర్థ్యం ఉన్న ఫాస్ట్ ఛార్జర్‌ను తీసుకోవడం మంచిది.
వైర్లెస్ ఛార్జింగ్
'యాపిల్ మాగ్‌సేఫ్ ఛార్జర్'తో 20 వాట్ అడాప్టర్ ఉపయోగిస్తే ఐఫోన్ 12, ఆ తర్వాత వచ్చిన మోడల్స్ చాలా వేగంగా ఛార్జ్ అవుతాయి. దీంతో 15-వాట్ వైర్లెస్ ఛార్జింగ్ పొందొచ్చు. వాటితో ఐఫోన్‌ను కేవలం 30 నిమిషాల్లోనే 30 శాతం వరకు ఛార్జ్ అవుతుంది.
కంప్యూటర్ ద్వారా ఛార్జింగ్ చేయవద్దు
చాలా మంది యాపిల్ ల్యాప్‌టాప్ ద్వారా ఐఫోన్లను ఛార్జ్ చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఫోన్ చాలా నెమ్మదిగా ఛార్జ్ అవుతుంది. మీ కంప్యూటర్లోని యూఎస్బీ పోర్ట్ ఎంత పెద్దగా ఉన్నా, యూఎస్బీ-ఏ, యూఎస్బీ-సీ అయినా లేదా కొత్త కంప్యూటర్, పాతదైనా సరే అది 5-వాట్ పవర్‌ను అడాప్టర్ ఇచ్చే ఛార్జింగ్ కూడా ఇవ్వదు. మీ ఐఫోన్ త్వరగా ఛార్జ్ కావడానికి ఉపయోగపడదు.
ఛార్జింగ్ చేసేటప్పుడు ఐఫోన్ వాడొద్దు
ఐఫోన్ ఛార్జింగ్ కోసం పెట్టినప్పుడు దానిని ఉపయోగించకూడదు. ఎందుకంటే వీడియోలు చూడటం, గేమ్స్ ఆడడం వంటి చేయడం వల్ల ఛార్జ్ స్లోగా అవుతుంది.
టర్న్ ఆఫ్ చేసి ఛార్జింగ్
ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఐఫోన్‌ను టర్న్ ఆఫ్ చేయాలి. ఎందుకంటే ఫోన్‌ను ఉపయోగించకపోయినా. బ్యాక్ గ్రౌండ్లో పని చేస్తూనే ఉంటుంది. దీంతో ఛార్జ్ స్లోగా అవుతుంది.
ప్లైట్ మోడ్‌లో ఛార్జింగ్
ఒక వేళ మీకు ఫోన్‌ను టర్న్ ఆఫ్ చేయడం ఇష్టం లేకపోతే ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి ఛార్జ్ చేయవచ్చు. వైఫై, బ్లూటూత్ లాంటివి పనిచేయడం ఆగిపోతుంది. దీని వల్ల త్వరగా ఐఫోన్ ఛార్జ్ అవుతుంది.
ఐఫోన్ సెట్టింగ్స్ మార్చాలి
- లో పవర్ మోడ్ : ఐఫోన్‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'లో పవర్ మోడ్'ను టర్న్ ఆన్ చేయాలి. దీని వల్ల 5జీ, డిస్ప్లే బ్రైట్నెస్, ఆటో-లాక్, బ్యాక్‌గ్రౌండ్ యాప్ రీఫ్రెష్, ఆటోమేటిక్ డౌన్లోడ్స్ వంటివి బ్యాటరీని కన్జూమ్ చేయకుండా నియంత్రించవచ్చు.
- డార్క్‌మోడ్ : ఫోన్‌ను డార్క్‌మోడ్‌లో ఉంచడం వల్ల బ్యాటరీ లైఫ్ సేవ్ అవుతుంది.
- స్క్రీన్ బ్రైట్నెస్ : స్క్రీన్ బ్రైట్నెస్ ఎక్కువగా ఉంటే ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుంది. అందుకే వీలైనంత వరకు స్క్రీన్ బ్రైట్నెస్ను తగ్గించుకోవాలి.
ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్
యాపిల్ డివైజ్‌లో బిల్ట్-ఇన్ టూల్‌గా 'ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్' ఉంటుంది. ఇది ఐఫోన్ బ్యాటరీ త్వరగా డీగ్రేడ్ కాకుండా చూస్తుంది. కానీ, దీని వల్ల మన ఐఫోన్ ఛార్జింగ్ చాలా స్లో అవుతుంది. అందుకే ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ ఆప్షన్‌ను డిజేబుల్ చేయడం మంచిది. ఐఫోన్ సెట్టింగ్స్‌లో బ్యాటరీ హెల్త్ అనే ఆప్షన్‌లోకి వెళ్తే ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ కనిపిస్తోంది. దానిని డిజేబుల్ చేయాలి.
కొత్త బ్యాటరీని కొనాల్సిందే
కచ్చితంగా ఐఫోన్ బ్యాటరీ హెల్త్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ మీ ఫోన్ బ్యాటరీ పూర్తిగా డీగ్రేడ్ అయిపోతే, కొత్తది తీసుకోవడం మంచిది.
ఆండ్రాయిడ్, ఐఫోన్, ల్యాప్‌టాప్, ఇయర్‌బడ్స్ - ఇక అన్నింటికీ ఒకే ఛార్జర్!
డబ్బులు పంపించే ముందు అకౌంట్ వెరిఫికేషన్ - RTGS, NEFTలో పొరపాట్లకు చెక్ పెట్టాలా ఆర్బీఐ ప్లాన్!