Sammakka sarakka Gaddela Premises Expansion : సాధారణ రోజుల్లో పెరుగుతున్న రద్దీ, మహా జాతరను దృష్టిలో పెట్టుకుని ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వన దేవతలు సమ్మక్క, సారలమ్మల గద్దెల ప్రాంగణాన్ని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కానీ భూసేకరణకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. గద్దెల ప్రాంగణం, పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో గద్దెల ప్రాంగణం చుట్టూ ఉన్న 19 ఎకరాల భూమిని సేకరించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం దేవతల మూల నిధి నుంచి 2023 అక్టోబరులో రూ.2.72 కోట్లను ములుగు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేశారు. అయితే ఈ 19 ఎకరాల భూమిలో కొందరికి మాత్రమే శాశ్వత పట్టాలు ఉన్నాయి. మరికొందరికి లావుణి పట్టాలు ఉండగా, ఇంకొందరు కాస్తులో ఉన్నారు.
అన్నదాతలకు తక్షణ పరిహారం ఇస్తాం : ఈ భూములు కొన్న కొందరు బినామీలు స్థానిక ప్రజలను ప్రభావితం చేస్తూ అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. గద్దెల ప్రాంగణం చుట్టూ ఐదు వందల మీటర్ల వరకు ఎలాంటి ప్రైవేటు నిర్మాణాలు చేపట్టవద్దని ప్రభుత్వం 2012 మహా జాతర సమయంలో ప్రకటించింది. అప్పట్లో పలు కట్టడాలను సైతం కూల్చి వేశారు. ఆ తరువాత ఎవరూ పట్టించుకోకపోవడంతో గద్దెల ప్రాంగణం చుట్టూ నిర్మాణాలు వెలుస్తున్నాయి. వ్యాపారమే లక్ష్యంగా స్థానిక ప్రజలు, స్థానికేతరులు అద్దె సత్రాలు, హోటల్స్, కిరాణ దుకాణాల కోసం ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. మరోవైపు భూములు ఇచ్చిన అన్నదాతలకు తక్షణ పరిహారం ఇచ్చేందుకు దేవాదాయ శాఖ సిద్ధంగా ఉందని ఆలయ ఈవో రాజేంద్రం అన్నారు.
రేషన్‌కార్డుదారులకు గుడ్‌న్యూస్ - ఫిబ్రవరి నుంచి సన్నబియ్యం పంపిణీ!
రేషన్ కార్డులో కొత్త పేర్లు యాడ్ చేయాలా? - ఇలా ఈజీగా చేసేయండి!