Rahmanullah Gurbaz Elite Record :దుబాయ్‌లోని షార్జా వేదికగా తాజాగా జరిగిన ఆఖరి వన్డే పోరులో బంగ్లాదేశ్‌ను 5 వికెట్ల తేడాతో చిత్తు చేసింది అఫ్గానిస్థాన్ జట్టు. అలా మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఇక ఈ మ్యాచ్‌లో స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ తన ఇన్నింగ్స్‌తో అఫ్గాన్ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఈ విజయంతో గుర్భాజ్ ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
సచిన్, కోహ్లీ రికార్డులు బ్రేక్!
ఎంతో ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో రహ్మానుల్లా ఓ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. ఓవరాల్‌గా ఈ గేమ్‌లో 120 బంతులు ఆడి అందులో 5 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో ఏకంగా 101 పరుగులు స్కోర్ చేశాడు. అలా 245 పరుగుల లక్ష్య చేధనను అఫ్గాన్ జట్టుకు ఈజీగా చేసి ఆ టీమ్ గెలుపులో ఓ కీలక భాగమయ్యాడు. అయితే గుర్బాజ్ ఈ సెంచరీతో ఓ రేర్ రికార్డును సొంతం చేసుకున్నాడు.
అంతర్జాతీయ వన్డేల్లో అతి పిన్న వయస్సులోనే ఎనిమిది సెంచరీలు నమోదు చేసిన రెండో క్రికెటర్‌గా రికార్డుకెక్కాడు. కేవలం 22 సంవత్సరాల, 349 రోజుల వయస్సులో గుర్భాజ్ ఈ ఫీట్‌ను అందుకుని సచిన్ తెందూల్కర్, విరాట్ కోహ్లీల రికార్డులను బ్రేక్ చేశాడు.