U- 19 Players Mega Auction 2025 : 2025 ఐపీఎల్ మెగావేలానికి సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా వేలం ప్రారంభం కానుంది. ఈ మెగా వేలం ఆదివారం, సోమవారం రెండు రోజులు జరగనుంది. వేలానికి 1,574 మంది క్రికెటర్లు తమ పేర్లు నమోదు చేసుకోగా, అందులో 574 మందిని మాత్రమే నిర్వాహకులు షార్ట్ లిస్ట్ చేశారు. అయితే వీరిలో టీమ్ఇండియా తరఫున 2024 అండర్- 19 వరల్డ్ కప్ ఆడిన కుర్రాళ్లు ఉన్నారు. ఈ క్రమంలో వారిపై భారీగా అంచనాలు ఉన్నాయి. మరి వారెవరు? వేలంలో భారీ ధర పలుకుతారా? తెలుసుకుందాం.
- ఉదయ్ సహారన్ : ఈ యంగ్ ప్లేయర్ అండర్-19 వరల్డ్ కప్‌లో టీమ్ఇండియా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. 7 మ్యాచుల్లో 56.71 సగటుతో 397 రన్స్‌తో అదరగొట్టాడు. ఇందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. తనదైన హిట్టింగ్తో టీమ్ఇండియాకు విజయాలను అందించాడు. ఈ క్రమంలో మెగావేలంలో ఉదయ్‌ను ఏ ఫ్రాంచైజీ దక్కించుకుంటుందోనని ఆసక్తి నెలకొంది.
- ముషీర్ ఖాన్ : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడే ఈ ముషీర్ ఖాన్. రీసెంట్ అండర్-19 ప్రపంచకప్‌లో ముషీర్ ఖాన్ కూడా రఫ్పాడించాడు. ఆరు మ్యాచుల్లో 60 సగటుతో 360 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉంది. ఈ క్రమంలోనే టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అలాగే ఏడు వికెట్లు కూడా తీశాడు. అలాగే ముషీర్ రంజీల్లోనూ అదరగొట్టాడు. 9 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 51.14 సగటుతో 716 పరుగులు చేశాడు. అందులో ఒక డబుల్ సెంచరీ ఉండడం విశేషం.
- సచిన్ దాస్ : యంగ్ క్రికెటర్ సచిన్ దాస్ అండర్-19 ప్రపంచకప్‌లో ఏడు మ్యాచుల్లో 303 రన్స్‌తో రాణించాడు. అందులో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి. మహారాష్ట్ర తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ ఈ కుర్ర సంచలనం అదరగొడుతున్నాడు.
- అర్షిన్ కులకర్ణి : అర్షిన్ కులకర్ణిని గత ఐపీఎల్లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. అయితే అతడికి ఆడే అవకాశం దక్కలేదు. ఈ యువ ఆల్ రౌండర్ అండర్-19 వరల్డ్ కప్‌లో ఏడు మ్యాచుల్లో 27 సగటుతో 189 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ ఉంది. నాలుగు వికెట్లు కూడా పడగొట్టాడు. మహారాష్ట్ర తరఫున ఫస్ట్ క్లాస్ కెరీర్లోనూ రాణిస్తున్నాడు.
- సౌమీ పాండే : ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ అండర్ 19 వరల్డ్ కప్‌లో 18 వికెట్లు సత్తా చాటాడు. టీమ్ఇండియా తరఫున టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ ఇతడే. అలాగే నమన్ తివారీ, రాజ్ లింబానీ వంటి పేసర్లు కూడా అండర్ 19 వరల్డ్ కప్‌లో అదరగొట్టారు.
నెక్ట్స్ విరాట్ అవుతారా?
అయితే టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా అండర్-19 వరల్డ్ కప్ ఆడే భారత జట్టులోకి వచ్చాడు. అలాగే ఐపీఎల్లో అడుగుపెట్టాడు. 2008 అండర్-19 విన్నింగ్ టీమ్‌లో విరాట్ సభ్యుడు. ఆ తర్వాత కింగ్ కోహ్లీని ఆర్సీబీ వేలంలో దక్కించుకుంది. ఆ తర్వాత తన దూకుడును పెంచుకుని ఆర్సీబీలో కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. అలాగే జట్టు పగ్గాలను సైతం చేపట్టాడు.
ఐపీఎల్ కెరీర్లో 252 మ్యాచుల్లో 8 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలతో 8,004 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా నిలవడమే కాకుండా, ఆర్సీబీని అత్యంత ప్రజాదరణ పొందిన ఫ్రాంచైజీగా మార్చడంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే టీమ్ఇండియా తరఫున 2024 అండర్-19 వరల్డ్ కప్ ఈ ప్లేయర్లలో ఎవరు భవిష్యత్ విరాట్ కోహ్లీ అవుతారో చూడాలి మరి!
JUST IN: Musheer Khan scored Century vs Ireland in U-19 World Cup Match.
— زماں (@Delhiite_) January 25, 2024
And His Brother Sarfraz Khan scored 150* vs England A in 2nd unofficial Test match. pic.twitter.com/3w870TZAXW
Latest Auction Updates, Exclusive Interviews 🎬 and your ultimate guide to #TATAIPLAuction 🔨
— IndianPremierLeague (@IPL) November 23, 2024
Head to https://t.co/4n69KTSZN3 and stay updated with all the action from the #TATAIPL Mega Auction 😎 pic.twitter.com/RvQCSXoKfn
IPL వేలానికి ముందు షాక్- ఆ ప్లేయర్లపై BCCI నిషేధం!
ఐపీఎల్ ఈ సారి ముందుగానే - నెక్స్ట్ మూడు సీజన్లకూ డేట్స్ ఫిక్స్!