ETV Bharat / sports

IPL వేలానికి ముందు షాక్- ఆ ప్లేయర్లపై BCCI నిషేధం! - PLAYERS BAN FROM IPL AUCTION

మెగా వేలానికి ముందు బీసీసీఐ చర్యలు- వాళ్లపై నిషేధం విధించే ప్రమాదం!

Players Ban From IPL
Players Ban From IPL (Source : IANS)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 23, 2024, 7:25 PM IST

Players Ban From IPL Auction : 2025 ఐపీఎల్ మెగా వేలానికి ముందు బీసీసీఐ కొందరు ప్లేయర్లకు షాక్ ఇవ్వనుంది. అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ ఉన్న బౌలర్లపై కఠిన చర్యలు తీసుకోనుంది. ఈ క్రమంలో అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ ఉన్న ప్లేయర్ల జాబితాను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. వీరిపై వేటు పడే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ జాబితాలో ఉన్న వాళ్లందరూ మెగా వేలంలో ఉన్నవారే కావడం వల్ల ఇది క్రీడావర్గాల్లో హాట్​టాపిక్​గా మారింది.

వీరు బ్యాన్!
టీమ్ఇండియా క్రికెటర్లు మనీశ్ పాండే, సృజిత్ కృష్ణన్​ దేశవాళీలలో కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్‌ తరఫున ఆడుతున్నారు. అయితే వీరిద్దరి బౌలింగ్ యాక్షన్ అనుమానస్పదంగా ఉండడం వల్ల వీరిపై బీసీసీఐ నిషేధం విధించింది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025 మెగావేలానికి ముందు మరో ముగ్గురు ప్లేయర్లను బీసీసీఐ సందేహాస్పద జాబితాలో చేర్చడం గమనార్హం. యంగ్ ప్లేయర్ దీపక్ హుడా(రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్), సౌరభ్ దూబే (విదర్భ క్రికెట్ అసోసియేషన్), కేసీ కరియప్ప (మిజోరాం క్రికెట్ అసోసియేషన్)ను ఈ సందేహాస్పద జాబితాలో బీసీసీఐ చేర్చింది.

ఆ లిస్ట్ లోనే- కానీ!
దీపక్ హుడా, సౌరభ్ దూబే, కేసీ కరియప్ప అనుమానాస్పద బౌలర్ల జాబితాలోకి చేరినప్పటికీ, వీళ్లపై ప్రస్తుతానికి ఎలాంటి నిషేధం లేదు. కానీ, వీరిపై నిషేధం పడే ప్రమాదం మాత్రం ఉంది. స్పిన్​ ఆల్​రౌండర్ దీపక్ హుడా మెగా వేలంలో డిమాండ్ ఉన్న లోకల్ ఆటగాళ్లలో ఒకడు. హుడా తన కనీస ధర రూ.75 లక్షలుగా నిర్ణయించుకోగా, కరియప్ప, సౌరభ్ దూబే రూ.30 లక్షల బేస్​ప్రైజ్​తో వేలంలో ఉన్నారు. కానీ, వేలానికి ముందు వీళ్లు సందేహాస్పద జాబితాలో ఉండడం పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.

ఫ్రాంచైజీలకు సమాచారం
కాగా, నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ 2025 మెగావేలం జరగనుంది. ఈ క్రమంలో యంగ్ ప్లేయర్లపై బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఈ ఐదుగురి బౌలింగ్ యాక్షన్ గురించి కూడా బీసీసీఐ ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలకు తెలియజేసినట్లు తెలుస్తోంది.

IPL 2025, ఈ దశాబ్దంలోనే అతిపెద్ద మెగా వేలం - ఎందుకో తెలుసా?

IPL మెగా వేలానికి డేట్స్ ఫిక్స్- ఆక్షన్ జరిగేది ఎక్కడంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.