Rishabh Pant Accident : టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ రోడ్డు ప్రమాదం తర్వాత రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. పెర్త్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో నితీశ్ రెడ్డితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో ఓ స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టర్ అతడి యాక్సిడెంట్, రీ ఎంట్రీపై స్పెషల్ వీడియో చేసింది. అయితే ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది.
2022 డిసెంబర్లో రోడ్డు ప్రమాదం బారిన పడ్డ రిషభ్‌ను ఇద్దరు యువకులు రజత్ కుమార్, నిశు కుమార్ హాస్పిటల్‌కు తరలించారు. ఆ యాక్సిడెంట్ పట్ల మొదట స్పందించింది ఈ ఇద్దరు యువకులే. అటుగా వెళ్తున్న వాళ్లిద్దరూ యాక్సిడెంట్ పట్ల వెంటనే స్పందించి అంబులెన్స్‌కు సమాచారం అందించడంతో పంత్‌కు సరైన సమయానికి ట్రీట్మెంట్ ప్రారంభమైంది. దీంతో పలు సర్జరీల తర్వాత పంత్ పూర్తిగా కోలుకున్నాడు. దీనిపై అప్పట్లో పంత్ కూడా స్పందించాడు. ఆ యువకులిద్దరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు.
I may not have been able to thank everyone individually, but I must acknowledge these two heroes who helped me during my accident and ensured I got to the hospital safely. Rajat Kumar & Nishu Kumar, Thank you. I'll be forever grateful and indebted 🙏♥️ pic.twitter.com/iUcg2tazIS
— Rishabh Pant (@RishabhPant17) January 16, 2023
తన ప్రాణాలు కాపాడడంలో కీలక పాత్ర పోషించిన యువకులిద్దరికీ పంత్ ఒక్కో స్కూటీ గిఫ్ట్‌గా ఇచ్చాడు. తాజా వీడియోలో ఆ యువకులు ఇద్దరు పంత్ గిఫ్ట్‌గా ఇచ్చిన స్కూటీలు నడుపుతూ కనిపించారు. ఆ వాహనాలపై 'రిషభ్ పంత్' అని రేడియంతో రాసి ఉంది. అయితే ఈ విషయం ఎవరికీ తెలియదు. పంత్ కూడా తాను స్కూటీలు బహుమతిగా ఇచ్చినట్లు ఎక్కడా చెప్పుకోలేదు. దీంతో నెటిజన్లు పంత్‌ను ప్రశంసిస్తున్నారు. స్కూటీలతో పాటు ఇంకా ఏమి ఇచ్చి ఉంటాడని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.
Rishabh Pant gifted two wheeler vehicle to Rajat and Nishu ❤️
— Naman (@Im_naman__) November 23, 2024
Thank you Rajat and Nishu ( They were the first responders on that horrific day ). We are indebted to you.#RishabhPant pic.twitter.com/Zb3Haj75zF
The two people who saved Rishabh Pant's life after his accident had no idea who he was.@beastieboy07 travels back to India to retrace the steps from Pant's accident to his return, but also much more than that.
— 7Cricket (@7Cricket) November 23, 2024
The tale of Rishabh's recovery, from those closest to him 🙏 pic.twitter.com/UuzaJBN0QT
కాగా, రీ ఎంట్రీలో పంత్ ఆకట్టుకుంటున్నాడు. 2024 ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగిన పంత్ 446 పరుగులతో సత్తా చాటాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్‌ల్లోనూ రాణించాడు. ఇక 2025 ఐపీఎల్‌కు గాను దిల్లీ ఫ్రాంచైజీ పంత్‌ను రిటైన్ చేసుకోలేదు. దీంతో పంత్ మెగా వేలంలోకి వచ్చాడు. ఇక పంత్‌పై పలు ఫ్రాంచైజీలు కన్నేశాయి. ఈ క్రమంలో రిషభ్ భారీ ధరకు అమ్ముడయ్యే ఛాన్స్‌లు ఉన్నాయి.
'ఆ ఏడు నెలలు నరకం అనుభవించాను - కనీసం బ్రష్ కూడా చేయలేకపోయా ' - Rishabh Pant Latest Interview
'అన్నదమ్ములే సర్వస్వం!'.. పంత్‌ను కలిసిన భజ్జీ, రైనా, శ్రీశాంత్