ETV Bharat / spiritual

ఆ రాశుల వారికి ఈ వారం కొన్ని విషయాల్లో పెను సవాళ్లు- గట్టిగా ఎదుర్కోవాల్సిందే! - WEEKLY HOROSCOPE

ఈ వారం మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2024, 2:19 AM IST

Weekly Horoscope From 24th Nov to 30th Nov 2024 : 2024 నవంబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 30వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి వారికి వారం ప్రథమార్ధం కన్నా ద్వితీయార్ధం బాగా కలిసి వస్తుంది. వారం ప్రారంభంలో వృత్తి వ్యాపారాలలో తీవ్రమైన పోటీ సవాళ్లు ఎదురుకావచ్చు. పట్టుదలతో పని చేసి సవాళ్లను అధిగమిస్తారు. మీ వాక్చాతుర్యంతో వృత్తి పరంగా అందరినీ ఆకట్టుకుంటారు. కొత్త ప్రాజెక్టులు, కాంట్రాక్టులు సొంతం చేసుకుంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయాన్ని గడపడం ద్వారా మీ బంధాన్ని బలోపేతం చేసుకుంటారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. వ్యాపారంలో ఎదురయ్యే ఆటుపోట్లను సహనంతో ఎదుర్కోవాలి. కుటుంబ సభ్యుల నుంచి శుభ వార్తలు అందుకుంటారు. అనవసర ఖర్చులు పెట్టే ముందు మీ ఆర్ధిక పరిస్థితిని గుర్తు పెట్టుకోవడం మంచిది. దైవబలం అండగా ఉంటుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా ముఖ్యమైన వ్యవహారాల్లో కొందరు వ్యక్తులు ఆటంకాలు సృష్టిస్తారు. సమయానుకూలంగా నడుచుకుంటూ ముందుకు సాగడం అవసరం. కోపావేశాలను నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. గత కొంతకాలంగా వాయిదా పడుతున్న ఆస్తుల కొనుగోలు, అమ్మకాలు సాఫీగా సాగిపోతాయి. కుటుంబంలో సంపద వృద్ధి చెందుతుంది. స్థిరాస్తి వ్యాపారాలు నూతన వెంచర్లలో గణనీయమైన ఆర్థిక లాభాలను చూడవచ్చు. జీవిత భాగస్వామితో అనుబంధం దృఢ పరచుకోడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు కృషితో విజయాన్ని అందుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడంలో అవరోధాలు ఎదురవుతాయి. చేపట్టిన పనుల్లో తీవ్ర జాప్యం నిరాశకు గురి చేస్తుంది. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో ఉద్రిక్త వాతావరణం ఉండవచ్చు. సహనంతో, అందరి సహకారంతో సకాలంలో పనులు పూర్తి చేయడంపై దృష్టి సారిస్తే మంచిది. ఉన్నతాధికారుల సహకారం ఉండకపోవచ్చు. కుటుంబ కలహాలు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఆర్ధికంగా ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. సన్నిహితులతో సంబంధాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. పిల్లల సంతోషం కోసం అధిక ధనవ్యయం చేస్తారు. స్థిరాస్తులు, వాహనాలు కొనుగోలు విషయంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. ఓర్పుతో సహనంతో పరిస్థితులతో సర్దుకుపోవడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) : కర్కాటక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ఈ రాశి వారు ఈ వారం అన్ని విధాలా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. వృత్తిపరమైన మీ ప్రయత్నాలకు అంతరాయం కలిగించే వారిని మీ నుంచి దూరం ఉంచండి. వారం ప్రారంభంలో వ్యాపారం నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కీలకమైన ఒప్పందాలు చేసుకునే ముందు అనుభవజ్ఞులను సంప్రదిస్తే మంచిది. ఉద్యోగంలో ఏర్పడే చిన్నపాటి సమస్యలు అధికారుల చొరవతో పరిష్కారం అవుతాయి. వృత్తి పరంగా పని ఒత్తిడి పెరగవచ్చు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు అండగా నిలవడం ముఖ్యం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది. శుభ సమయం నడుస్తోంది. పట్టినదల్లా బంగారం అవుతుంది. వృత్తి వ్యాపారాలలో మీరు కలలు కన్న స్థాయికి చేరుకుంటారు. ఆర్ధికంగా ఈ వారం గొప్ప అదృష్టం తీసుకువస్తుంది. ఊహించని ధనలాభాలు ఉంటాయి. పూర్వీకుల ఆస్తి కలిసి వస్తుంది. ప్రేమ సంబంధాలు పెద్దల ఆమోదంతో వివాహబంధంగా మారుతాయి. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది. బంధు మిత్రులతో విహారయాత్రలకు వెళ్తారు. గృహ నిర్మాణాలు చేపడతారు. నూతన వస్తు వాహనాల కోసం ధనవ్యయం చేస్తారు. విద్యార్థులు చదువుల్లో రాణిస్తారు. ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా సుదూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అడుగడుగునా అవరోధాలు చికాకు పెడతాయి. ఉద్యోగులకు పెరిగిన పనిభారంతో పాటు రుణభారం కూడా పెరుగుతుంది. అదనపు ఆదాయ వనరుల కోసం ప్రయత్నిస్తారు. జీవిత భాగస్వామితో నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం. వివాహ బంధంలో తలెత్తే సమస్యలను పరిష్కరించడం చాలా ముఖ్యం. లక్ష్య సాధన కోసం కృషి చేయడం అవసరం. విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెట్టాలి. స్థిరాస్తి వ్యాపారాలలో ఆశించిన రాబడి లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. సానుకూల దృక్పథాన్ని కొనసాగించడం వలన భవిష్యత్తులో విజయం సాధించవచ్చు. కుటుంబ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి ఆరోగ్యకరమైన జీవనశైలితో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. సహనంతో ఉంటే అన్ని సమస్యలు సర్దుకుంటాయి. ఈశ్వరుని ఆలయ సందర్శన శుభకరం.

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఈ వారం చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. పెద్దల మార్గదర్శకత్వం, మద్దతుతో కెరీర్‌లో పురోగతి, ఆదాయ వృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం అవసరం. విద్యార్థులకు ఈ వారం సానుకూలంగా ఉంటుంది. చదువు పట్ల ఆసక్తి ఏకాగ్రతతో మంచి విజయాలను సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు లాభదాయకంగా ఉంటాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశ్చర్యకరమైన బహుమతులు అందుకుంటారు. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీ విష్షు సహస్రనామ పారాయణ శుభకరం.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ వారం ఫలవంతంగా ఉంటుంది. ఈ వారం వృశ్చికరాశి వారు ఆర్థిక విషయాలలో గణనీయమైన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి. వైవాహిక జీవితంలో ఆనందం నెలకొంటుంది. బంధువుల మధ్య కలహాలు దారితీసే అవకాశం ఉంది. అదనపు ఆదాయానికి, ఆర్థిక లాభాలకు అవకాశం ఉంది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు తగ్గు ముఖం పట్టి మంచి ఆరోగ్యం చేకూరుతుంది. ఆర్థిక వ్యవహారాలను వ్యూహాత్మకంగా నిర్వహించడం, ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సు రాశి వారికి ఈ వారం ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అన్ని విధాలా ఆచి తూచి నడుచుకోవాల్సిన సమయం. ముఖ్యంగా ఆర్ధికంగా ముందు చూపుతో వ్యవహరించాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. గిట్టని వారి నుంచి సమస్యలు ఎదురయ్యే ప్రమాదముంది. ఆర్థిక రంగంలో, ఆలోచనతో పెట్టుబడులు పెట్టడం భవిష్యత్తులో మోసపోకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యమైన కుటుంబ నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం ముఖ్యం. ఆస్తి వివాదాలను జాగ్రత్తగా డీల్ చేయాలి. తోబుట్టువులతో మంచిగా వ్యవహరించడం ద్వారా, ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొంటుంది. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. కష్ట సమయాల్లో మీ భాగస్వామి మద్దతుగా లభిస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. నవగ్రహ శ్లోకాలు పఠించడం శ్రేయస్కరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చేసే పనులు, మాట్లాడే మాటలు జాగ్రత్తగా ఉండేలా చూసుకోవాలి. మీ మాట తీరు కారణంగా వృత్తి పరంగా మంచి అవకాశాలు కోల్పోయే ప్రమాదముంది. ఉద్యోగులు పనులు సకాలంలో పూర్తి చేయడానికి మరింత కృషి చేయాల్సి ఉంటుంది. సహోద్యోగుల సహకారం లోపించడంతో నిరాశకు గురవుతారు. కీలక నిర్ణయాలు తీసుకునే విషయంలో కుటుంబ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని తీసుకోవాలి. జీవిత భాగస్వామి అభిప్రాయాలను గౌరవించాలి. కుటుంబం పట్ల బాధ్యతతో ఉంటే మంచిది. వ్యాపారంలో నష్ట భయం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తవచ్చు. నవగ్రహాల ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్హి కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. కెరీర్ పరంగా అనుభవజ్ఞుల సలహా మేరకు నడుచుకుంటే విజయం చేకూరుతుంది. ఆర్ధిక క్రమశిక్షణ పాటించడం అవసరం. వ్యాపారస్తులు రుణభారం పెరగకుండా చూసుకోవాలి. భవిష్యత్తు అవసరాల కోసం పొదుపు ప్రణాళికలు చేపట్టాలి. సన్నిహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను కించ పరిచేలా మాట్లాడే విధానం మానుకుంటే మంచిది. బంధువుల మధ్య ఏర్పడ్డ మనస్పర్థలు చర్చలతో పరిష్కరించుకోవాలి. జీవిత భాగస్వామి పట్ల గౌరవంతో మెలగాలి. విద్యార్థులు విజయం కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కార్యసిద్ధి హనుమ ఆరాధన మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. అదృష్టం కలిసివచ్చి సంపన్నులు అవుతారు. వ్యక్తిగతంగా, వృత్తిపరమైన అంశాలలో విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. కెరీర్, స్థిరాస్తి వ్యాపార వెంచర్లలో పురోగతికి అవకాశం ఉంది. సన్నిహితల సహకారంతో ఆర్ధిక ప్రయోజనాలు అందుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు, స్వస్థాన ప్రాప్తి ఉన్నాయి. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. జీవిత భాగస్వామితో సుదీర్ఘ ప్రయాణాలు చేస్తారు. ఇది మీ బంధాన్ని మరింత దృఢ పరుస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో ఆనందం, ఐక్యత పెరుగుతుంది. శివారాధన శుభప్రదం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.