R Ashwin Love Story :క్రికెట్ ప్రపంచానికి రవిచంద్రన్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే అతని పర్సనల్ లైఫ్ గురించి మాత్రం చాలా మందికి తెలియదు. అశ్విన్ ఇంజినీరింగ్ చదివాడని, ఫుల్ టైమ్ క్రికెటర్‌గా మారక ముందు, కొంత కాలం సాప్ట్వేర్ జాబ్ కూడా చేశాడని తక్కువ మందికి తెలుసు.
అశ్విన్ ఇంజినీర్, క్రికెటర్, యూట్యూబర్ మాత్రమే కాదు, ఓ గ్రేట్ లవర్ కూడా. ప్రస్తుతం పారిస్ టూర్లో ఉన్న అశ్విన్, తన ఫ్యామిలీతో కలిసి ఆ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అశ్విన్ వైఫ్ ప్రీతి నారాయణన్ పాత ఇంటర్వ్యూ వైరల్‌గా మారింది. అందులో ఆమె పంచుకున్న లవ్ స్టోరీ ఇదే!
చాలా రోజుల తర్వాత అలా కలిశాను!
"మేమిద్దరం కలిసి ఒకే మిడిల్ స్కూల్లో చదువుకున్నాం. అలా మేము ఒకరికొకరు తెలుసు. అయితే పెద్దవాళ్లం అయ్యాక, మళ్లీ ఓ సారి ఇద్దరూ కలిశాం. అప్పుడు నేను ఒక ఈవెంట్స్ కంపెనీలో పని చేస్తున్నాను. అయితే అశ్విన్‌కి నా మీద పెద్ద క్రష్ ఉందని స్కూల్ మొత్తానికి తెలుసు. కానీ క్రికెట్ కోసం తను చాలా స్కూల్స్ మారాడు. దీంతో అప్పుడప్పుడు బర్త్ డే పార్టీల్లోనో లేకుంటే లోకల్గానో కలిసేవాళ్లం. నేను చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ అకౌంట్స్‌ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు, అశ్విన్‌ను మళ్లీ కలిశాను." అంటూ అప్పటి మధుర క్షణాలను గుర్తు చేసుకుంది.
జీవితమంతా ఇష్టపడ్డాను!
ప్రీతికి క్రికెటర్ అశ్విన్ ఓ క్రికెట్ గ్రౌండ్లో ప్రపోజ్ చేశాడు. ఆమెతో నేరుగా "నా జీవితమంతా నేను నిన్ను ఇష్టపడ్డాను, గత పదేళ్లుగా అందులో ఏ మార్పు లేదు. ఇప్పుడు మనం పెద్దవాళ్ల మయ్యాం. లెట్స్ ట్రై దిస్" అని చెప్పాడు. అశ్విన్, ప్రీతికి 2011లో వివాహమైంది. వీరికి ఇప్పుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.