Punjab Kings Ownership Preity Zinta : ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్‌లో విభేదాలు తలెత్తినట్లు తెలిసింది. ఆ జట్టు సహ యజమానుల మధ్య విభేదాలు వచ్చాయని క్రికెట్ వర్గాలు తెలిపాయి.
ఈ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో బాలీవుడ్ స్టార్ నటి ప్రీతీ జింటా, పారిశ్రామికవేత్తలు నెస్ వాడియా, మోహిత్ బర్మన్ ప్రధాన వాటాదారులుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన షేర్లను ఇతర భాగస్వాములైన నెస్ వాడియా, ప్రీతీ జింటాకు తెలియకుండా మోహిత్ బర్మ సిద్ధమయ్యారట. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రీతీ జింటా, మోహిత్ బర్మను అడ్డుకునేందుకు చండీగఢ్ హైకోర్టును ఆశ్రయించినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వచ్చాయి.
కొట్టి పారేసిన మోహిత్ -అయితే తాను తన షేర్లను అమ్మేందుకు సిద్ధమైనట్లు వచ్చిన వార్తలను బర్మన్ కొట్టి పడేశారు. తాను ఎలాంటి షేర్లను అమ్మడం లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ విషయంపై పంజాబ్ కింగ్స్ తరఫున అధికార ప్రతినిధులు ఎవరూ స్పందించలేదు.
కాగా, కంపెనీ నిబంధనల ప్రకారం వాటాదారులుగా ఉన్నవారు తమ వాటాలను అమ్మేయాలనుకుంటే ముందుగా బయటి వారికి కాకుండా తమ భాగస్వాములకు సమాచారం అందించాలి. వారే కొనుగోలు చేసేలా అవకాశం ఇవ్వాలి. ఒకవేళ వారు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించకపోతే అప్పుడు బహిరంగంగా ఆ వాటాలను విక్రయించు కొనేందుకు ఛాన్స్ ఉంటుంది. కానీ, పంజాబ్ కింగ్స్ విషయంలో ఇలా జరగకపోవడం వల్లనే ప్రీతీ జింటా చట్ట పరమైన చర్యలకు ఉపక్రమించినట్లు కథనాలు వస్తున్నాయి.
తలరాత మారడం లేదు - ఇకపోతే ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ట్రోఫీని అందుకోని జట్లలో పంజాబ్ కింగ్స్ ఒకటి. ఈ టీమ్‌కు పలువురు కెప్టెన్లు మారుతున్నా తలరాత మాత్రం అస్సలు మారడం లేదు. 2014 తర్వాత అయితే ఒక్కసారి కూడా ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించలేదు. గత సీజన్‌లో 9వ స్థానంతో సరి పెట్టుకుంది. మొత్తం 14 మ్యాచులు ఆడి 5 గెలిచింది, 9 మ్యాచుల్లో ఓడింది. అయితే ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించి 262 పరుగుల అత్యధిక స్కోరును ఛేదించిన టీమ్‌గా ఓ రికార్డను ఖాతాలో వేసుకుంది.
రిటైర్మెంట్‌పై వినేశ్ ఫొగాట్ వెనక్కి? - Vinesh Phogat Retirement Uturn
పారిస్ ఒలింపిక్స్ తర్వాత నీరజ్ చోప్రా బ్రాండ్ వ్యాల్యూ ఎంత పెరిగిందంటే? - Neeraj Chopra Brand Value