Gold Rate Today December 18th 2024 : గుడ్ న్యూస్. దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.79,975 ఉండగా, బుధవారం నాటికి రూ.1,110 తగ్గి రూ.78,865కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.91,556 ఉండగా, బుధవారం నాటికి రూ.201 తగ్గి రూ.91,355కు చేరింది.
- Gold Price In Hyderabad December 18th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.78,865గా ఉంది. కిలో వెండి ధర రూ.91,355గా ఉంది.
- Gold Price In Vijayawada December 18th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.78,865గా ఉంది. కిలో వెండి ధర రూ.91,355గా ఉంది.
- Gold Price In Visakhapatnam December 18th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.78,865గా ఉంది. కిలో వెండి ధర రూ.91,355గా ఉంది.
- Gold Price In Proddatur December 18th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.78,865గా ఉంది. కిలో వెండి ధర రూ.91,355గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price December 18th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. సోమవారం ఔన్స్ గోల్డ్ ధర 2,654 డాలర్లు ఉండగా, బుధవారం నాటికి 8 డాలర్లు తగ్గి 2,646 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.40 డాలర్లుగా ఉంది.
స్టాక్ మార్కెట్ న్యూస్
Stock Market Today December 18th 2024 : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్ల ప్రకటనకు ముందు మదుపర్లు అప్రమత్తంగా ఉండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 144 పాయింట్లు నష్టపోయి 80,567 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయి 24,292 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో ఉన్న షేర్లు : సన్‌ఫార్మా, హిందూస్థాన్ యూనిలివర్, టెక్ మహీంద్రా, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, ఏసియన్ పెయింట్స్, ఐటీసీ, ఇన్ఫోసిస్, నెస్లే ఇండియా, భారతీ ఎయిర్‌టెల్
- నష్టాల్లో ఉన్న షేర్లు : టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్, ఎల్ అండ్ టీ, అదానీ పోర్ట్స్, మారుతి సుజుకి, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్‌టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్
రూపాయి విలువ
Rupee Value December 18th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ ఒక్క పైసా తగ్గింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ రూ.84.92 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol And Diesel Prices December 18th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.45గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.