Jasprit Bumrah vs Australia : బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అదరగొడుతున్న టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కెరీర్లో మరో అరుదైన ఘనత సాధించాడు. గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లతో రాణించిన బుమ్రా, రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్నాడు. స్టార్ బ్యాటర్లు ఉస్మాన్ ఖవాజా (8 పరుగులు), మార్నస్ లబుషేన్ (1 పరుగు) ను పెవిలియన్ చేర్చాడు.
ఈ క్రమంలోనే ఆసీస్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 10 ఇన్నింగ్స్‌ల్లో 53 వికెట్లు పడగొట్టిన బుమ్రా, దిగ్గజం కపిల్ దేవ్ (51 వికెట్లు)ను అధిగమించి ఆల్‌టైమ్ రికార్డు కొట్టాడు. ఇందులో 3సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు.
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు
బౌలర్ | వికెట్లు | ఎకనమీ |
జస్ప్రీత్ బుమ్రా | 53 వికెట్లు | 2.39 |
కపిల్ దేవ్ | 51 వికెట్లు | 2.49 |
అనిల్ కుంబ్లే | 49 వికెట్లు | 3.46 |
రవిచంద్రన్ అశ్విన్ | 40 వికెట్లు | 2.93 |
బిషన్ బేడి | 35 వికెట్లు | 2.14 |
ఈ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి బుమ్రా మొత్తం 8 వికెట్లు (తొలి ఇన్నింగ్స్ 5, రెండో ఇన్నింగ్స్ 3) పడగొట్టాడు. దీంతో ఆసీస్ గడ్డపై టెస్టుల్లో బుమ్రా 53 వికెట్లు పడగొట్టి టాప్‌లో కొనసాగుతున్నాడు. ఇక ఈ ఒక్క సిరీస్‌లోనే ఇప్పటివరకు ఏకంగా 21 వికెట్లు నేలకూల్చాడు.
There is simply no stopping Jasprit Bumrah!#AUSvIND pic.twitter.com/rQ5Btkk4Cq
— cricket.com.au (@cricketcomau) December 18, 2024
Bumrah Test Career : కాగా, 2018లో టెస్టు అరంగేట్రం చేసిన బుమ్రా ఆరేళ్లుగా జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటివరకు 43 మ్యాచ్‌ల్లో 2.75 ఎకనమీతో బుమ్రా 194 వికెట్లు దక్కించుకున్నాడు. ఇందులో 12సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. మరో 6 వికెట్లు పడగొడితే 200 వికెట్ల మైలురాయి అందుకుంటాడు. ప్రస్తుతం బుమ్రా ఉన్న ఫామ్‌కు నాలుగో మ్యాచ్‌లోనే ఈ మైలురాయి అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను 89/7 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ లీడ్ 185 పరుగులు కలుపుకొని భారత్‌కు 275 రన్స్ టార్గెట్ నిర్దేశించింది.
Usman Khawaja ✅
— BCCI (@BCCI) December 18, 2024
Marnus Labuschagne ✅
Vice-captain Jasprit Bumrah at it again 🔥🔥
Live - https://t.co/dcdiT9NAoa#TeamIndia | #AUSvIND | @Jaspritbumrah93 pic.twitter.com/GzWFSQqkyI
బుమ్రా ఆసక్తికర సమాధానంపై స్పందించిన గూగుల్ - ఏం చెప్పిందంటే?