ETV Bharat / international

భారత్​పై ట్యాక్స్ రివెంజ్ తప్పదు: ట్రంప్ - TRUMP ON INDIA TARIFFS

అమెరికా ఉత్పత్తులపై భారత్‌ అత్యధిక పన్నులు విధిస్తుందంటున్న డొనాల్డ్ ట్రంప్- ప్రతిచర్య ఉంటుందని వార్నింగ్​

Trump On India Tariffs
Trump On India Tariffs (Source : Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Updated : 2 hours ago

Trump On India Tariffs : అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న రిపబ్లికన్‌ నేత డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి భారత్‌ సుంకాల అంశాన్ని ప్రస్తావించారు. అమెరికా ఉత్పత్తులపై న్యూదిల్లీ అత్యధిక టారిఫ్‌లు వసూలు చేస్తోందని ఆరోపించారు. దీనికి ప్రతీకార పన్ను తప్పదంటూ మళ్లీ హెచ్చరికలు చేశారు. ఫ్లోరిడాలోని తన ఎస్టేట్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

"అమెరికా ఉత్పత్తులపై భారత్‌, బ్రెజిల్‌ వంటి దేశాలు అత్యధిక టారిఫ్‌లు విధిస్తున్నాయి. 100, 200శాతం పన్నులు వేస్తున్నాయి. దేనికైనా ప్రతిచర్య ఉంటుంది. వాళ్లు మాపై పన్నులు విధిస్తే మేమూ అంతేస్థాయిలో పన్నులు వసూలు చేస్తాం. ఒకవేళ భారత్‌ 100 శాతం పన్నులు విధిస్తే మేము వారిపై అలాగే ఛార్జ్‌ చేయకూడదా? ఆయా దేశాలు సుంకాలు వసూలుచేయడం అనేది వారి ఇష్టమే. కానీ, మేం కూడా అలాగే స్పందిస్తాం" అని ట్రంప్‌ వివరించారు.

తాను అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై అత్యధిక సుంకాలు విధిస్తానని గతంలో కూడా ట్రంప్‌ హెచ్చరించారు. 2019లో ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భారత్‌ను టారిఫ్‌ కింగ్‌గా అభివర్ణించారు. అప్పడు భారత్‌కు జనరలైజ్డ్‌ సిస్టమ్ ఆఫ్‌ ఫ్రిపరెన్సెస్‌-GSPని రద్దు చేశారు. అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన ఉత్పత్తులపై కస్టమ్స్‌ డ్యూటీ మినహాయింపు లేదా రాయితీలు ఇచ్చేందుకు అమెరికా జీఎస్పీ తెచ్చింది. అయితే ఆ హోదా వల్ల భారత మార్కెట్లలోకి సమాన, హేతుబద్ధ సంధానత లభించలేదని అప్పట్లో ట్రంప్‌ ఆరోపించారు. ఈ హోదాను పునరుద్ధరణకు ఇరుదేశాల మధ్య చర్చలు చర్చలు జరుగుతున్నాయి.

మరోవైపు, భారత్‌, అమెరికా సంబంధాలపై ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ యంత్రాంగం కీలక వ్యాఖ్యలు చేసింది. బైడెన్‌ పాలనలో ఇరుదేశాల మధ్య బంధం మరింత బలపడిందని పేర్కొంది. ట్రంప్‌ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత కూడా దీన్ని కొనసాగించాలని ఆశాభావం వ్యక్తంచేసింది. భారత రాయబారి వినయ్‌ మోహన్‌ క్వాత్రాతో భేటీ సందర్భంగా అమెరికా విదేశాంగశాఖ డిప్యూటీ సెక్రటరీ కర్ట్‌ కాంప్‌బెల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.