Ind vs Aus Test 2024 : గబ్బా టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోర్ 252-9 తో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమ్ఇండియా మరో 8 పరుగులు జోడించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ స్కోర్ 260-10. చివరి వికెట్‌గా ఆకాశ్ దీప్ (31 పరుగులు : 44 బంతుల్లో) వెనుదిరిగాడు. 78.5 ఓవర్ వద్ద ఆకాశ్‌ను స్పిన్నర్ ట్రావిస్ హెడ్ పెలివియన్ పంపి, భారత్ ఇన్నింగ్స్‌కు తెర దించాడు. కాగా, 10వ వికెట్‌కు జస్ప్రీత్ బుమ్రా (10*), ఆకాశ్ దీప్ స్ఫూర్తిదాయకమైన భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ 78 బంతులు ఎదుర్కొని 47 పరుగుల పార్ట్నర్షిప్ చేశారు.
తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌కు 185 పరుగుల లీడ్ లభించింది. భారత్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మళ్లీ వర్షం అడ్డంకి కలిగించింది. దాదాపు గంటన్నర తర్వాత మ్యాచ్ ప్రారంభమైంది. దీంతో ఐదో రోజు 98 ఓవర్లపాటు ఆట నిర్వహించాలని అంపైర్లు డిసైడ్ చేశారు. అయితే మధ్యమధ్యలోనూ వర్షం వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ దూకుడుగా ఆడే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే 11 పరుగుల వద్ద ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (8) బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Innings Break!
— BCCI (@BCCI) December 18, 2024
A fine 47-run partnership for the final wicket ends as #TeamIndia post 260 in the first innings 👌👌
Over to our bowlers 🙌
Live - https://t.co/dcdiT9NAoa#AUSvIND pic.twitter.com/CWOEBzK9y7
ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ మరో 25- 30 ఓవర్లు ఆడి డిక్లేర్డ్ చేసే ఛాన్స్ ఉంది. తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకొని భారత్‌కు ఆసీస్ 300 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించవచ్చు. అయితే వర్షం మళ్లీ ఆంతరాయం కలిగించే ఛాన్స్ ఉండడం వల్ల పూర్తి ఓవర్ల ఆట జరగడం కష్టం. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఆసీస్ బౌలర్లను అటు ఇటుగా రెండు సెషన్లపాటు నిలువరించాలి. అలా ఎదుర్కోగలిగితే భారత్ మ్యాచ్‌ను ఈజీగా డ్రా చేసుకోవచ్చు.
అది కలిసొచ్చే అంశం
ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ నాలుగో రోజు ఆటలో గాయపడ్డాడు. దీంతో అతడు ఐదో రోజు ఆటకు అందుబాటులో ఉండడం లేదు. అలాగే మిగిలిన రెండు టెస్టుల్లోనూ జోజిల్వుడ్ ఆడడం కష్టమే. ఇది భారత్‌కు కలిసొచ్చే అంశం.
హమ్మయ్యా! - భారత్‌కు తప్పిన ఫాలో ఆన్ గండం!
బుమ్రా ఆసక్తికర సమాధానంపై స్పందించిన గూగుల్ - ఏం చెప్పిందంటే?