Cristiano Ronaldo 900th Goal:పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానొ రొనాల్డో కెరీర్లో 900వ గోల్ సాధించాడు. దీంతో ఫుట్‌బాల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా రొనాల్డో రికార్డు సృష్టించాడు. యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ (UEFA) లో క్రోషియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో ఈ మైలురాయి అందుకున్నాడు. ఫస్ట్ హాఫ్‌లో 34వ నిమిషం వద్ద అద్భుతమైన షాట్‌తో సాధించిన రొనాల్డో 900వ గోల్ పూర్తి చేశాడు. ఈ అరుదైన ఫీట్ అందుకోగానే రొనాల్డో ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు.
'ఇది నాకు ఎమోషనల్ మూమెంట్. ఈ ఘనత సాధించడం కోసం నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నా. కానీ, నేను ఈ మైలురాయి అందుకుంటానని నాకు తెలుసు. కెరీర్లో ఆడుతూ ముందుకెళ్తే ఇది సాధించడం మామూలే. అయితే ఇది సాధారమైన మైలురాయిలా కనిపించవచ్చు. కానీ, 900 గోల్స్ చేయాలంటే ఎంతో హార్డ్ వర్క్ చేయాలి. శారీరకంగా కూడా చాలా ఫిట్‌గా ఉండాలి. ఇది సాధించడానికి నేను చేసిన హార్డ్ వర్క్ నాకు మాత్రమే తెలుసు. నా కెరీర్లో ఇది అద్భుతమైన సందర్భం' అని మ్యాచ్ ముగిసిన తర్వాత రొనాల్డో అన్నాడు.
1000 గోల్సే నా టార్గెట్
'నేను 1000 గోల్స్ పూర్తి చేయాలనుకుంటున్నా. ఎటువంటి గాయాలు కాకపోతే నా టార్గెట్ దీనిపైనే ఉంటుంది. మా మట్టుకు సాధించడం ఫుట్‌బాల్‌లో 900 గోల్స్ సాధిండం బెస్ట్ మార్క్. ఇక నా తదుపరి లక్ష్యం వెయ్యి గోల్స్ సాధించడమే' అని రొనాల్డో అన్నాడు.