తెలంగాణ

telangana

ETV Bharat / sports

జూలు విదిల్చిన పంజాబ్- టీ20 హిస్టరీలోనే భారీ ఛేజింగ్- మ్యాచ్​లో రికార్డులివే! - 2024 IPL

PKBS vs KKR IPL 2024: 2024 ఐపీఎల్​లో కోల్​కతాపై పంజాబ్ జూలు విదిల్చింది. ఏకంగా 262 పరుగుల టార్గెట్​ను మరో 8 బంతులు ఉండగానే ఛేదించి రికార్డు నెలకొల్పింది.

PKBS vs KKR IPL 2024
PKBS vs KKR IPL 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 27, 2024, 7:05 AM IST

PKBS vs KKR IPL 2024: 2024 ఐపీఎల్​లో రికార్డులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. శుక్రవారం కోల్​కతా నైట్​రైడర్స్​తో జరిగిన మ్యాచ్​లో పంజాబ్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ఛేజింగ్ (262-2)తో రికార్డ్ నెలకొల్పింది. కేకేఆర్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని చూసి బెదరని పంజాబ్ బ్యాటర్లు బౌండరీలు బాదడమే పనిగా పెట్టుకున్నారు.

ఈ క్రమంలో ప్రభ్​సిమ్రన్ సింగ్ (54 పరుగులు, 20 బంతుల్లో), జాని బెయిర్​స్టో (108 పరుగులు, 48 బంతుల్లో), శశాంక్ సింగ్ (68 పరుగులు, 28 బంతుల్లో) రెచ్చిపోయారు. దీంతో మరో 8 బంతులు మిగిలుండగానే పంజాబ్ ఐపీఎల్ హిస్టరీలోనే భారీ స్కోర్​ ఛేజింగ్ చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్​తోపాటు అంతర్జాతీయ టీ20లోనూ పలు రికార్డులు బ్రేక్ చేసింది. ​అవేంటో తెలుసా?

ఐపీఎల్​లో భారీ టార్గెట్ సక్సెస్​ఫుల్ ఛేజింగ్స్

  • 262 - పంజాబ్ vs కోల్​కతా, ఐపీఎల్ 2024
  • 224 - రాజస్థాన్ vs పంజాబ్, ఐపీఎల్ 2020
  • 224- రాజస్థాన్ vs కోల్​కతా, ఐపీఎల్ 2024
  • 219- ముంబయి vs చెన్నై, ఐపీఎల్ 2021

అంతర్జాతీయ టీ 20లో హైయెస్ట్​ సక్సెస్​ఫుల్ ఛేజింగ్

  • 262 - పంజాబ్ vs కోల్​కతా, ఐపీఎల్ 2024
  • 262 - సౌతాఫ్రికా vs వెస్టిండీస్, టీ20 2023
  • 253 - మిడిలెక్స్ vs సుర్రె, టీ20 బ్లాస్ట్ 2023

టీ20ల్లో సెకండ్ ఇన్నింగ్స్​ టాప్ స్కోర్లు

  • 262/2 - పంజాబ్ vs కోల్​కతా, ఐపీఎల్ 2024
  • 262/7 - ఆర్సీబీ vs సన్​రైజర్స్, ఐపీఎల్ 2024
  • 259/4 - సౌతాఫ్రికా vs వెస్టిండీస్, ఇంటర్నేషనల్ టీ20 (2023)
  • 254/3- మిడిలెక్స్ vs సుర్రె, టీ20 బ్లాస్ట్ (2023)
  • 253/8 - క్వాట్టా గ్లాడియేటర్స్ vs ముల్తాన్ సుల్తాన్, పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (2023)

ఐపీఎల్​ సింగిల్ ఇన్నింగ్స్​లో అత్యధిక సిక్స్​లు

  • 24 - పంజాబ్ vs కోల్​కతా, ఐపీఎల్ 2024
  • 22 - సన్​రైజర్స్ vs ఆర్సీబీ, ఐపీఎల్ 2024
  • 22 - సన్​రైజర్స్ vs దిల్లీ క్యాపిటల్స్, ఐపీఎల్ 2024
  • 21 - ఆర్సీబీ vs పుణె, ఐపీఎల్​ 2013

టీ20 మ్యాచ్​లో అత్యధిక సిక్స్​లు

  • 42- పంజాబ్ vs కోల్​కతా, ఐపీఎల్ 2024
  • 38 - సన్​రైజర్స్ vs ముంబయి, ఐపీఎల్ 2024
  • 38 - సన్​రైజర్స్ vs ఆర్సీబీ, ఐపీఎల్ 2024
  • 37 - బల్క్ లెజెండ్స్ vs కాబుల్ జ్వానన్, అబుదాబీ ప్రీమియర్ లీగ్ 2019
  • 37 - సెయింట్ కిట్స్ అండ్ పాట్రియేట్స్ vs జమైకా , కరీబియన్ లీగ్ 2019

ఐపీఎల్​లో అత్యధిక స్కోర్లు (రెండు జట్లు కలిపి)

  • 549 - సన్​రైజర్స్ vs ఆర్సీబీ, ఐపీఎల్ 2024
  • 523 - సన్​రైజర్స్ vs ముంబయి, ఐపీఎల్ 2024
  • 523 - పంజాబ్ vs కోల్​కతా, ఐపీఎల్ 2024
  • 469 - రాజస్థాన్ vs చెన్నై, ఐపీఎల్ 2010
  • 465 - సన్​రైజర్స్ vs దిల్లీ క్యాపిటల్స్, ఐపీఎల్ 2024

పంజాబ్ రికార్డ్​ ఛేజింగ్​ - ఉత్కంఠ పోరులో కోల్​కతాపై విజయం - IPL 2024 PBKS VS KKR

ధావన్​ ఎప్పుడు తిరిగొస్తాడంటే? - IPL 2024

ABOUT THE AUTHOR

...view details