తెలంగాణ

telangana

ETV Bharat / sports

నీరజ్​ చోప్రా బయోపిక్​కు ఆ హీరో మాత్రమే సెట్ అవుతాడు : ఒలింపిక్ గోల్డ్​ విన్నర్​ అర్షద్ - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Pairs Olympics 2024 Neeraj Chopra Arshad Nadeem : భారత్​కు చెందిన జావెలిన్ త్రోయర్ నీరజ్​ చోప్రా బయోపిక్​కు బాలీవుడ్​కు చెందిన ఓ ప్రముఖ హీరో మాత్రమే సెట్ అవుతాడని అతని మిత్రుడు ఒలింపిక్​ గోల్డ్​ మెడలిస్ట్​ పాకిస్థాన్ అథ్లెట్ అర్షద్ నదీమ్ అన్నాడు. పూర్తి వివరాలు స్టోరీలో.

source Associated Press
Paris olympics Neeraj Chopra Arshad Nadeem (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Aug 12, 2024, 6:00 PM IST

Pairs Olympics 2024 Neeraj Chopra Arshad Nadeem : పారిస్​ ఒలింపిక్స్ 2024లో అథ్లెట్ల పోరాటం ముగిసింది. కానీ ఈ ఒలింపిక్స్​కు సంబంధించిన చర్చలు ఇంకా క్రీడాభిమానుల్లో సాగుతూనే ఉన్నాయి. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ప్రపంచ నలుమూలలకు సంబంధించిన అథ్లెట్లు వేరు వేరు విభాగాల్లో తమ ప్రతిభను కనబరిచారు. మన భారత్​కు చెందిన జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో పురుషుల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి దేశాన్ని గర్వించేలా చేశాడు. గతంలో టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణం సాధించిన చోప్రా ఈ సారి రజతాన్ని ముద్దాడాడు. ఇదే ఈవెంట్​లో పాకిస్థాన్ ప్లేయర్ అర్షద్ నదీమ్ తన అద్భుతమైన ప్రదర్శనతో స్వర్ణ పతాకాన్ని దక్కించుకున్నాడు. ఈటెను 92.97 మీటర్ల దూరం విసిరిన నదీమ్ ఒలింపిక్స్​లో సరికొత్త రికార్డు నమోదు చేశాడు. నీరజ్ ఈటెను 89.45 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు.

అయితే నీరజ్​, అర్షద్​లు మంచి మిత్రులు. వీరిద్దరూ ఒకరి మీద ఒకరు అపారమైన గౌరవం, అభిమానం కలిగి ఉంటారు. ఈ నేపథ్యంలో ఆట ముగిసిన తర్వాత 2024 ఒలింపిక్స్​ కార్యక్రమాన్ని స్ట్రీమింగ్​ చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ జియో ఈ ఇద్దరు హీరలతో కాసేపు మచ్చటించింది. అందులో నీరజ్ అర్షద్​ బయోపిక్​ల గురించి చర్చ జరిగింది.

ఈ సందర్భంగా నీరజ్​ బయోపిక్​కు ఏ హీరో సరిపోతారా అని అర్షద్​ను ప్రశ్నించగా, బాలీవుడ్ బాద్ షా షారుక్​​ ఖాన్ అయితే బాగా సెట్ అవుతాడని బదులిచ్చాడు అర్షద్. అలాగే అర్షద్ బయోపిక్ తీస్తే అందులో అతని పాత్రకు ఏ హీరో సెట్ అవుతాడని నీరజ్​ను ప్రశ్నించగా, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పేరును చెప్పాడు నీరజ్. అర్షద్ పొడవుకు, ఫిట్నెస్​కు అమితాబ్ బచ్చన్ అయితే బాగా సెట్ అవుతాడని నీరజ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వీరిద్దరు చెప్పిన ఈ మాటలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇలా ఇద్దరు అథ్లెట్లు టాప్ హీరోలను ఎంచుకోవడంతో దానికి అమితాబ్, షారుక్​లు ఎలా స్పందిస్తారా అనే ఆసక్తి క్రీడాభిమానుల్లో మొదలైంది.

'అలా జరిగినందుకు చాలా బాధగా ఉంది' : సిల్వర్​ మెడల్​ దక్కడంపై నీరజ్ చోప్రా - Neeraj Chopra Silver Medal

మాజీ క్రికెటర్ బలవన్మరణం!- షాకింగ్ విషయాలు బయటపెట్టిన అతడి భార్య!! - Graham Thorpe Comitted Suicide

ABOUT THE AUTHOR

...view details