తెలంగాణ

telangana

ETV Bharat / sports

పారిస్ ఒలింపిక్స్​కు ఏఐ నిఘా - ప్రైవసీపై వెల్లువెత్తుతున్న ఆందోళనలు - Paris Olympics 2024 - PARIS OLYMPICS 2024

Paris Olympics 2024 : పారిస్‌ ఒలింపిక్స్‌లో మెరుగైన భద్రత కల్పించేందుకు ఫ్రాన్స్‌ ఏఐ టెక్నాలజీని వినియోగించనుంది. ఇందుకు అవసరమైన చట్టాలను కూడా సవరించింది. అయితే దాని కారణంగా ప్రైవసీ విషయంలో పలు ఆందోళనలు వెల్లువెత్తుతాయట. ఇంతకీ ఏమైందంటే?

Paris Olympics 2024
Paris Olympics 2024 (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 7:48 AM IST

Paris Olympics 2024 :ఈ ఏడాదికిగానూపారిస్ ఒలింపిక్స్ జులై 26 నుంచి అట్టహాసంగా ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది అథ్లెట్లు, సహాయక సిబ్బంది, భారీగా సందర్శకులు ఈ విశ్వక్రీడలను తిలకించేందుకు హాజరుకానున్నారు. అయితే ఈ గ్లోబల్ ఈవెంట్‌కి కట్టుదిట్టమైన భద్రత కల్పించేందుకు ఫ్రాన్స్‌ చర్యలు తీసుకుంది. అడ్వాన్స్‌డ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(AI) సిస్టమ్స్‌తో కార్యకలాపాలపై నిఘా ఉంచనున్నారు. అయితే ఏఐ వినియోగించి విస్త్రృత స్థాయిలో డేటా కలెక్ట్‌ చేయడం, విశ్లేషించడం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సాయంతో నిఘా
ఫ్రెంచ్ ప్రభుత్వం, ప్రైవేట్ టెక్​ కంపెనీల సహాయంతో ఒలింపిక్స్ కోసం అడ్వాన్స్‌డ్‌ ఏఐ, సర్వీలియన్స్‌ టెక్నాలజీలను వినియోగిస్తుంది. ఇక ఈ విస్తృతమైన నిఘాను కల్పించడానికి, ఫ్రాన్స్ తన చట్టాలను సవరించింది. ఈ మార్పులతో ఎక్స్‌పెరిమెంటల్‌ ఏఐ వీడియో సర్వీలియన్స్‌, వైర్‌టాపింగ్, జియోలొకేషన్ ట్రాకింగ్, భారీగా విజువల్, ఆడియో డేటాను సేకరించడం, ఇతర అడ్వాన్స్‌డ్‌ డేటా గ్యాదెరింగ్‌ టూల్స్‌ వినియోగించడానికి అనుమతి లభిస్తుంది.

చట్టపరమైన చర్యలు
ఫ్రెంచ్ ప్రధాన మంత్రి కార్యాలయంతో పాటు, ఈవెంట్లు జరుగుతున్న సమయంలో ట్రెడిషినల్‌ సర్వీలియన్స్‌ మెథడ్స్‌ని మెరుగుపరచడానికి ప్రభుత్వాన్ని అనుమతించే క్లాసిఫైడ్ డిక్రీపై చర్చలు జరిపింది. ఇందులో వైర్ ట్యాపింగ్, జియో లొకేషన్ ట్రాకింగ్, కమ్యూనికేషన్, కంప్యూటర్ డేటాను సేకరించడం లాంటివి ఉంటాయి. వీడియో ఫీడ్‌లను సమీక్షించడానికి ఏఐ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించేందుకు మార్గం సుగమం చేసే ఆర్టికల్ 10 ఉన్నాయి. ఈ చట్టాల సవరణలతో ఇంత విస్తృతమైన ఏఐ-పవర్డ్‌ సర్వీలియన్స్‌ను చట్టబద్ధం చేసిన మొదటి యూరోపియన్‌ దేశంగా ఫ్రాన్స్‌ నిలిచింది.

ఏఐ ఎలా పని చేస్తుంది?
ఫ్రెంచ్ అధికారులు విడెటిక్స్‌, ఆరెంజ్‌ బిజినెస్‌, చాప్స్‌విజన్‌, వింటిక్స్‌ వంటి ఏఐ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారు. ఈ కంపెనీలు కన్సెర్ట్స్‌, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వంటి భారీ ఈవెంట్స్‌లో ఈ నిఘాను అందించాయి. మంచి ఫలితాలు కూడా సాధించాయి. ఇక ఇటువంటి భారీ ఈవెంట్స్‌లో జనాభాలో మార్పులు, వదిలివేసిన వస్తువులు, ఆయుధాలు, అసాధారణ ప్రవర్తనలు వంటివి గుర్తించేలా ఏఐ సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఉదాహరణకు, ఇది జనాభాలో వచ్చే హెచ్చుతగ్గులను లేదా వదిలేసిన బ్యాక్‌ప్యాక్‌ని గుర్తిస్తుంది. రియల్‌టైమ్‌లో భద్రతా సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.

ప్రైవసీ ఆందోళనలు
అయితే ఈ స్థాయిలో ఏఐ సర్వీలియన్స్‌ వినియోగిస్తుండటంతో కొన్ని ప్రైవసీ పరమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అవేంటంటే.డేటా సేకరణ, విశ్లేషణ : అనుమానాస్పద అంశాలను గుర్తించడానికి ఎంత డేటా సేకరిస్తారు? ఏ రకంగా అనలైజ్‌ చేస్తారు? ట్రైనింగ్‌ డేటా: ఎర్రర్ రేట్స్‌ ఎలా ఉన్నాయి? ఏఐ ఎంత ఖచ్చితంగా పని చేస్తుంది? సిస్టమ్‌ బయాస్డ్‌గా ఉండదనేందుకు రుజువుందా? డేటా వినియోగం, యాక్సెస్: సేకరించిన డేటాను ఏం చేస్తారు? ఈ డేటాకు ఎవరెవరికి యాక్సెస్‌ ఉంటుంది? బయోమెట్రిక్ డేటా దుర్వినియోగం కాకుండా అడ్డుకునే వ్యవస్థలు ఉన్నప్పటికీ, ఈ ఏఐ కలెక్టెడ్‌ డేటా దుర్వినియోగంపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈయూ చట్టాల ప్రకారం, బయోమెట్రిక్ డేటాగా పరిగణించే ఫిజియోలాజికల్‌ ఫీచర్లు, బిహేవిర్లను సిస్టమ్‌లు క్యాప్చర్ చేసి అనలైజ్‌ చేయవచ్చని విమర్శకులు ఆరోపిస్తున్నారు.

బీజింగ్‌లో FBI సూచనలు
ఏఐ నిఘాను ఉపయోగించడం ఒలింపిక్స్‌లో కొత్త కాదు. బీజింగ్‌లో 2022 వింటర్ ఒలింపిక్స్ సమయంలో, సెక్యూరిటీ, ప్రైవసీ ఆందోళనలు చాలా ఎక్కువయ్యాయి. దీంతో ప్రభుత్వ నిఘాను నివారించడానికి బర్నర్ ఫోన్‌లను ఉపయోగించమని FBI అథ్లెట్లకు సూచించింది. ఈయూ మెంబర్‌గా ఫ్రాన్స్, జనరల్ డేటా ప్రొటెక్షన్‌ రెగ్యులేషన్‌ (GDPR), రానున్న AI యాక్ట్‌ సహా EU కఠినమైన డేటా ప్రైవసీ చట్టాలను తప్పనిసరిగా పాటించాలి. అయితే వివిధ స్థానిక వర్గాలు , ఫ్రాన్స్ కొత్త చట్టాలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, ముఖ్యంగా బయోమెట్రిక్ డేటా ప్రొటెక్షన్‌ను అధిగమిస్తున్నారని చెబుతున్నాయి.

ఒలింపిక్స్ పతకాలు- టాప్​లో USA- భారత్ ఖాతాలో ఎన్నంటే? - Paris Olympics 2024

ఒలింపిక్స్​ స్వర్ణ పతకంలో బంగారం శాతం ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details