Navdeep Singh Favourite Cricketer :పారిస్ పారాలింపిక్స్ గోల్డ్ విన్నర్ నవ్‌దీప్ సింగ్ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాడు. పారిస్ నుంచి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని నవ్‌దీప్ కలిసిన వీడియో ఫుల్ వైరల్‌గా మారింది. గోల్డ్ విన్నర్ నవ్‌దీప్, ప్రధాని మోదీకి క్యాప్ తొడగడం నెటిజన్లను బాగా ఆకట్టుకుంది. ఇలా నవ్‌దీప్‌కు సంబంధించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో నవ్‌దీప్ ఓ పాడ్‌కాస్ట్ షో లో పాల్గొన్నాడు.
ఈ షో లో అతడు పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నాడు. 'విరాట్ కోహ్లీ, ఎమ్ఎస్ ధోనీ ఈ ఇద్దరిలో నీ అభిమాన క్రికెటర్ ఎవరు?' అని యాంకర్ నవ్‌దీప్‌ను అడిగాడు. దీనికి నవ్‌దీప్ ఒక్క సెకన్ ఆలోచించకుండా 'రోహిత్ శర్మ' అని చెప్పాడు. 'రోహిత్ శర్మనే ఎందుకు నీ ఫేవరెట్' అని అడగ్గా, అతడు డబుల్ సెంచరీ బాదినప్పటి నుంచి తనకు హిట్‌మ్యాన్ అంటే ఇష్టం అని పేర్కొన్నాడు. 'రోహిత్ శర్మ చాలా బాగా ఆడతాడు. రోహిత్ డబుల్ సెంచరీ బాదినప్పటి నుంచి అతడికి ఫ్యాన్ అయిపోయా. ఆ ఇన్నింగ్స్ చాలా అద్భుతం. విరాట్ కోహ్లీ కూడా మంచి ప్లేయర్. కానీ, నాకు రోహిత్ అంటేనే చాలా ఇష్టం' అని నవ్‌దీప్ అన్నాడు.