ETV Bharat / state

16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు శాశ్వతంగా తొలగింపు - కారణమిదే - DISTRICT EDUCATION OFFICER

గత కొన్నేళ్లుగా అనధికారికంగా ప్రభుత్వ పాఠశాలలకు గైర్హాజరవుతున్న టీచర్లు - ఐదు సార్లు నోటీసులు పంపినా స్పందించని వైఖరి - సర్వీసు నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన డీఈవో

REMOVAL THE SERVICE OF TEACHERS
GOVERNMENT TEACHERS DISMISSED (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2025, 5:44 PM IST

16 Teachers Suspended in Yadadri District : దీర్ఘకాలికంగా తమ విధులకు హాజరుకాని 16 మంది ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఒకరు స్కూల్ అసిస్టెంట్ కాగా మిగిలిన 15 మంది ఎస్‌జీటీ ఉపాధ్యాయులు ఉన్నారు. వీరంతా గత కొన్నేళ్లుగా 2005 నుంచి 2022 వరకు విద్యాశాఖ అధికారులకు ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వకుండా అనధికారికంగా విధులకు గైర్హజరయ్యారు. దీంతో డీఈవో వారిపై సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు. గతంలో ఐదు సార్లు నోటీసులు పంపించినా వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవటంతో గెజిట్ నోటిఫికేషన్‌ ప్రచురించి వారందరినీ సర్వీస్ నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశామని డీఈవో సత్యనారాయణ తెలిపారు.

తొలగింపునకు గురైనవారు : యాదాద్రి జిల్లా పరిధిలోని సర్వీసు నుంచి తొలగించబడిన ఉపాధ్యాయులు వరుసగా స్కూల్‌ అసిస్టెంట్‌ 1.గీతారాణి, ఎస్జీటీలు (సెకండరీ గ్రేడ్‌ టీచర్) 2.విజయలక్ష్మి, 3.శ్రీనివాస్‌రెడ్డి, 4.ఉమారాణి, 5.ప్రభాకర్‌రెడ్డి, 6.అబ్దుల్‌హమీద్, 7.స్వప్న, 8.మాధవి, 9.నవీన్‌కుమార్, 10.ఎం.ఉమాదేవి, 11.క్రాంతికిరణ్, 12.జె.ఉమాదేవి, 13.నర్సింహారావు, 14.శైలజ, 15.భాగ్యలక్ష్మి, 16.కిరణ్‌కుమారీ.

బీఆర్ఎస్ మీటింగ్ ఎఫెక్ట్ - 106 మంది ఉద్యోగులపై ఈసీ సస్పెన్షన్ వేటు - EC Suspends 106 Govt Employees

ఐపీఎస్‌ అధికారి అంజనీకుమార్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.