తెలంగాణ

telangana

ETV Bharat / sports

గ్రూప్ - A 'సూపర్‌ - 8' అవకాశాలు ఎలా ఉన్నాయంటే? - T20 WorldCup 2024

Pakistan T20 World Cup 2024 Super 8 Qualification : టీ20 వరల్డ్‌ కప్​నకు ముందున్న అంచనాలు తలకిందులయ్యాయి. గ్రూప్‌ ఏ నుంచి ఇండియా, పాకిస్థాన్‌ సూపర్‌ 8కి చేరుతాయని అనుకున్నారు. ఇప్పుడు పాక్‌ ఎలిమినేషన్‌ అంచున ఉంది. గ్రూప్‌ ఏ నుంచి ఏ టీమ్‌లు నెక్స్ట్‌ స్టేజ్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటే?

Source The Associated Press
T20 World cup 2024 (Source The Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Jun 10, 2024, 6:44 PM IST

Pakistan T20 World Cup 2024 Super 8 Qualification : ఐసీసీ టీ20 వరల్డ్‌ కప్‌లో మొత్తం 20 టీమ్‌లు నాలుగు గ్రూపులుగా తలపడుతున్నాయి. ఆయా గ్రూపుల్లో టాప్‌ టూ పొజిషన్స్‌లో నిలిచిన జట్లు సూపర్‌ 8లోకి అడుగుపెడతాయి. టోర్నీకి ముందు గ్రూప్‌ ఏ నుంచి ఇండియా, పాకిస్థాన్‌ గ్రూప్‌ 8 చేరుతాయని అందరూ భావించారు. మిగతా మూడు యూఎస్‌ఏ, కెనడా, ఐర్లాండ్‌ వంటి చిన్న టీమ్‌లు కావడంతో భారత్‌, పాక్‌కు అడ్డు లేదనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జూన్‌ 9న ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ ఇండియాతో పాకిస్థాన్‌ ఓడిపోయి, సూపర్‌ 8 అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. మరోవైపు యూఎస్‌ఏ వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి, ఇండియాతోపాటు సూపర్ -8 రేసులో నిలిచింది. మిగిలిన రెండు మ్యాచుల్లోనూ పాక్‌ గెలిచినా, ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రూప్‌ ఏలో ఏ టీమ్‌లకు సూపర్‌ 8 అవకాశాలు ఉన్నాయంటే?

  • ఐర్లాండ్‌
    తొలి రెండు మ్యాచుల్లో ఓడిపోయిన ఐర్లాండ్‌కు కూడా సూపర్ 8 అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఐర్లాండ్‌ ఛాన్సెస్‌ మూడు టీమ్‌ల మీద ఆధార పడి ఉన్నాయి. యూఎస్‌ఏ, కెనడా, పాక్‌ను దాటి ఐర్లాండ్‌ రావాలంటే కష్టమే. జూన్‌ 14న యూఎస్‌ఏ, 16న పాకిస్థాన్‌తో ఆడుతుంది. ఈ మ్యాచుల్లో ఒక్కటి ఓడినా టోర్నీ నుంచి బయటకు వెళ్తుంది.
  • పాకిస్థాన్‌
    పాకిస్థాన్‌ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది. ఇంకా గెలుపు ఖాతా ఓపెన్‌ చేయలేదు. ఇప్పుడు మిగిలిన రెండు మ్యాచుల్లో భారీ విజయాలు అందుకుని, యూఎస్‌ఏ, కెనడా తమ మ్యాచుల్లో ఓడిపోతేనే పాక్‌కు సూపర్ 8 అవకాశాలు ఉంటాయి. జూన్‌ 11న కెనడా, 16న ఐర్లాండ్‌తో పాక్‌ తలపడనుంది. రెండూ గెలిస్తే పాక్‌ ఖాతాలో 4 పాయింట్లు ఉంటాయి. ఇందులో గెలిస్తే పాక్ ఖాతాలో 4 పాయింట్లు చేరతాయి. యూఎస్‌ఏ ఆడనున్న రెండు మ్యాచుల్లో ఒక్కటి గెలిచినా, పాక్‌ ఎలిమినేట్‌ అవుతుంది.
  • కెనడా
    మొదటి మ్యాచ్‌లో యూఎస్‌ఏతో ఓడిపోయిన కెనడా, రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌పై అద్భుత విజయం అందుకుంది. పాయింట్ల పట్టికలో ఒక విజయం, 2 పాయింట్లతో కెనడా మూడో స్థానంలో ఉంది. జూన్ 11న పాకిస్థాన్‌, జూన్‌ 15న భారత్‌తో ఆడుతుంది. ఈ రెండు మ్యాచుల్లో కెనడా మళ్లీ సంచలనం చేస్తే తప్ప విజయం దక్కే అవకాశం లేదు. కెనడా ఒక్క మ్యాచ్‌ గెలిచినా సూపర్- 8 రేసు మరింత ఆసక్తికరంగా మారుతుంది.
  • యూఎస్‌ఏ
    ఇప్పటి వరకు యూఎస్‌ఏ రెండు విజయాలు అందుకుంది. బలమైన పాకిస్థాన్‌ను ఓడించి ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారత్‌తో బుధవారం మ్యాచ్‌ ఆడనుంది. చివరి మ్యాచ్‌లో జూన్ 14న ఐర్లాండ్‌ను ఢీకొంటుంది. రెండు మ్యాచ్‌లు యూఎస్‌ఏకు కష్టమైనవే. కానీ మరోసారి సంచలనం చేస్తే, సూపర్‌ 8కి చేరుతుంది. పాక్‌ ఎలిమినేట్‌ అవుతుంది.
  • టీమ్‌ ఇండియా
    ఇండియా వరుసగా రెండు మ్యాచ్‌లు ఐర్లాండ్‌, పాక్‌పై నెగ్గింది. జూన్ 12న యూఎస్‌ఏ, జూన్ 15న కెనడాతో తలపడనుంది. 4 పాయింట్లతో మెరుగైన రన్‌రేట్‌ 1.455తో గ్రూప్‌ ఏలో టాప్‌ పొజిషన్‌లో ఉంది. సూపర్ 8కి చేరాలంటే ఇండియాకి ఒక్క విజయం చాలు. యూఎస్‌ఏ, కెనడాపై గెలవడం టీమ్‌ ఇండియాకి కష్టమేమీ కాదు. రెండు మ్యాచుల్లో భారత్‌ విజయం సాధిస్తే గ్రూప్‌ స్టేజ్‌లో టాప్‌ పొజిషన్‌లో ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details