Mohd Amir Pushpa Celebration:ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'పుష్ప 2' మేనియా నడుస్తోంది. సినిమాలో 'తగ్గేదేలే' మేనరిజానికి దేశవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ వచ్చింది. తాజాగా బార్డర్లు దాటి పాకిస్థాన్‌కు పుష్ప మేనియా పాకింది. వికెట్ తీసిన అనంతరం 'తగ్గేదేలే' అంటూ మేనరిజం ప్రదర్శిస్తూ పాక్ ఆటగాడు మహ్మద్ ఆమిర్ సంబరాలు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ మేనరిజాన్ని సినీ సెలబ్రిటీలే కాకుండా టీమ్ఇండియా క్రికెటర్లు సైతం మైదానంలో ప్రదర్శించారు. గతంలో రవీంద్ర జడేజా, డేవిడ్ వార్నర్, రీసెంట్గా ఆసీస్ పర్యటనలో నితీశ్ కుమార్ రెడ్డి సైతం 'తగ్గేదేలే' మేనరిజం ప్రదర్శించారు. తాజాగా ఈ మేనరిజం ఇంటర్నేషనల్ బార్డర్ దాటేసింది. ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లో వికెట్ పడగొట్టిన అనంతరం పాకిస్థాన్ పేసర్ మహ్మద్ ఆమిర్ తన సంతోషాన్ని తగ్గేదేలే మేనరిజంలో సెలబ్రేట్ చేసుకున్నాడు.
డెసర్ట్ వైపర్స్ x షార్జా మ్యాచ్
ఇంటర్నేషల్ లీగ్ టీ20లో భాగంగా జనవరి 22న దుబాయ్ వేదికగా డెసర్ట్ వైపర్స్ వర్సెస్ షార్జా వారియర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. డెసర్ట్ వైపర్స్ కెప్టెన్ లాకీ ఫెర్గూసన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదటి ఓవర్ ను మహ్మద్ ఆమిర్ వేశాడు. తొలి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో వికెట్ తీసిన ఆనందంలో తగ్గేదేలే మేనరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు ఆమిర్ . ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో పుష్ప మేనియా పాకిస్థాన్‌కు కూడా చేరిందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.