తెలంగాణ

telangana

ETV Bharat / sports

నీరజ్, మను బాకర్ నెట్​వర్త్​- ఇండియన్ టాప్ రిచ్చెస్ట్ అథ్లెట్లు వీళ్లే! - Indian Athletes Net Worth

Net worth of Indian Athletes: దేశానికి పతకం అందించడం కోసం అథ్లెట్లు వీరోచితంగా పోరాడుతుంటారు. అందుకు వారు చాలా త్యాగాలు కూడా చేస్తుంటారు. ఈ క్రమంలో భారత్, ప్రపంచంలోనే ఎక్కువ ఆస్తి ఉన్న టాప్-5 అథ్లెట్లు ఎవరో చూద్దాం.

Indian Athletes
Indian Athletes (Source: Associated Press (Neeraj), IANS Photos)

By ETV Bharat Sports Team

Published : Aug 28, 2024, 10:39 PM IST

Net worth of Indian Athletes:ప్రపంచవ్యాప్తంగా అథ్లెట్లకు ఉండే క్రేజే వేరు. దేశానికి పతకాలు అందించడం కోసం రేయింబవళ్లు శ్రమిస్తారు. తిండి, నిద్ర ఇలా చాలా సుఖాలను విడిచిపెట్టి కష్టపడి తాము అనుకున్నది సాధిస్తారు అథ్లెట్లు. ఒకసారి ఫేమ్ వచ్చాక అంతే మొత్తంలో ఆదాయం లభిస్తుంది. ఈ క్రమంలో భారత్, ప్రపంచంలో ఉన్న టాప్- 5 రిచ్చెస్ట్ అథ్లెట్ల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

భారత రిచ్చెస్ట్ ఐదుగురు అథ్లెట్లు

  1. నీరజ్ చోప్రా: భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్ నీరజ్‌ చోప్రా రెండు ఒలింపిక్ పతకాలను దేశానికి అందించాడు. నీరజ్ దేశంలో ఉన్న అత్యంత సంపన్న అథ్లెట్లలో మొదటిస్థానంలో నిలిచాడు. 2024 నాటికి నీరజ్ ఆస్తి విలువ 4.5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.38 కోట్లు). అలాగే మ్యాచ్ ఫీజు, బ్రాండ్ ఎండార్స్‌ మెంట్​ల ద్వారా నెలకు రూ.30 లక్షలకు పైగా సంపాదిస్తున్నాడు నీరజ్. దాదాపుగా ఈ ఆదాయమే నీరజ్​కు ఏటా రూ.4 కోట్లకు వరకు వస్తుంది.
  2. మను బాకర్: 2024 పారిస్ ఒలింపిక్స్​లో భారత్‌ కు రెండు కాంస్య పతకాలు అందించింది స్టార్ షూటర్ మను బాకర్. ఈమె దేశంలోని అత్యంత సంపన్న అథ్లెట్లలో రెండో స్థానంలో నిలిచింది. మను ఆస్తి దాదాపుగా 2 మిలియన్ డాలర్లు(రూ. 16.62 కోట్లు) వరకు ఉంటుంది. మను ఈ ఆదాయాన్ని ప్రభుత్వ ప్రోత్సాహకాలు, స్పాన్సర్‌షిప్‌ల నుంచి పొందింది.
  3. లవ్లీనా బోర్గోహైన్:భారత మహిళా బాక్సర్, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ దేశంలోని అత్యంత సంపన్న అథ్లెట్లలో మూడో స్థానంలో నిలిచింది. లవ్లీనా ఆస్తి దాదాపు 1 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీలో ఆమె ఆస్తి విలువ రూ. 8.31 కోట్లు. లవ్లీనాకు ఆదాయం అనేక రాష్ట్ర ప్రభుత్వాల ఇచ్చే రివార్డులు, ఎండార్స్​మెంట్స్ నుంచి వస్తోంది.
  4. నిఖత్ జరీన్: భారత దిగ్గజ బాక్సర్, ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ దేశంలోని అత్యంత ధనవంతులైన అథ్లెట్లలో ఆమె నాలుగో స్థానంలో నిలిచింది. జరీన్ ఆస్తి దాదాపు 500,000 అమెరికన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం రూ.4.15 కోట్లు. నిఖత్​కు స్పాన్సర్ షిప్, మ్యాచ్ ఆడినందుకు ఆదాయం వస్తోంది.
  5. అవినాశ్ సాబ్లే:భారత స్టీపుల్‌‌‌‌‌‌‌‌ ఛేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవినాశ్ సాబ్లే దేశంలోని అత్యంత సంపన్న అథ్లెట్లలో ఐదో స్థానంలో నిలిచాడు. 3000 మీటర్ల స్టీపుల్‌ ఛేజ్ ఈవెంట్‌ లో అవినాశ్ రాణించాడు. అవినాశ్ ఆస్తి విలువ 200,000 అమెరికా డాలర్లు(రూ. 1.66 కోట్లు). ఈ ఆదాయం అతడికి ప్రోత్సహకం, గేమ్స్ ద్వారా వస్తోంది.

ప్రపంచంలో అత్యంత ధనవంతులైన అథ్లెట్లు

  1. క్రిస్టియానో రొనాల్డో: పోర్చుగల్‌కు చెందిన 39 ఏళ్ల ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఆస్తి విలువ 260 మిలియన్ డాలర్లు ( దాదాపుగా రూ.2,183 కోట్లు). అందుకే ప్రపంచంలో అత్యంత సంపన్న అథ్లెట్ల జాబితాలో తొలిస్థానంలో రొనాల్డో నిలిచాడు. రొనాల్డో ఆన్ ఫీల్డ్ ఆదాయం 200 మిలియన్ డాలర్లుగా ఉంది. ఆఫ్ ఫీల్డ్ ఆదాయం 60 మిలియన్ డాలర్లు.
  2. జోన్ రహ్మ్: స్పెయిన్ కు చెందిన 29 ఏళ్ల గోల్ఫ్ స్టార్ జోన్ రాహ్మ్ అత్యంత సంపన్న అథ్లెట్లలో రెండో స్థానంలో నిలిచాడు. ఇతడి ఆస్తి విలువ 218 మిలియన్ డాలర్లు ( రూ.1,830 కోట్లు). అతని ఆన్ ఫీల్డ్ ఆదాయం 198 మిలియన్ డాలర్లు. అలాగే ఆఫ్ ఫీల్ట్ ఆదాయం 20 మిలియన్ డాలర్లుగా ఉంది.
  3. లియోనెల్ మెస్సీ: అర్జెంటీనాకు చెందిన 36 ఏళ్ల స్టార్ ఫుట్‌ బాల్ ప్లేయర్ ప్రపంచంలో అత్యంత సంపద కలిగిన మూడో అథ్లెట్ గా నిలిచాడు. ఇతడి ఆస్తి 135 మిలియన్ డాలర్లు(రూ.1,133 కోట్లు) మెస్సీ ఆన్ ఫీల్డ్ ఆదాయం 65 మిలియన్ డాలర్లు. ఆఫ్ ఫీల్డ్ ఆదాయం రూ. 70 మిలియన్ డాలర్లు.
  4. లెబ్రాన్ జేమ్స్: అమెరికాకు చెందిన 39 ఏళ్ల స్టార్ బాస్కెట్‌ బాల్ ప్లేయర్ లెబ్రాన్ జేమ్స్. ఈయన ఆస్తి విలువ 128.2 మిలియన్ డాలర్లు(రూ.1,076 కోట్లు). ప్రపంచంలోని నాలుగో సంపన్న అథ్లెట్ గా జేమ్స్ నిలిచారు. ఇతని ఆన్ ఫీల్డ్ ఆదాయం 48.2 మిలియన్ డాలర్లు. ఆఫ్ ఫీల్డ్ ఆదాయం 80 మిలియన్ డాలర్లు.
  5. జియానిస్ అంటెటోకౌన్‌పో:గ్రీస్‌ కు చెందిన 29 ఏళ్ల బాస్కెట్‌ బాల్ క్రీడాకారుడు జియానిస్ ఆంటెటోకౌన్‌పో. ప్రపంచంలోని ఐదో అత్యంత సంపన్న అథ్లెట్ గా నిలిచాడు. ఇతడి ఆస్తి మొత్తం ఆదాయం 111 మిలియన్ డాలర్లు(రూ.932 కోట్లు). ఆన్ ఫీల్డ్ ద్వారా 46 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుంది. ఆఫ్ ఫీల్డ్ ఆదాయం 65 మిలియన్ డాలర్లు.

గంభీర్ గ్యారేజీలో ఉన్న​ లగ్జరీ కార్లు ఇవే - అతడి నెట్​వర్త్​ ఎన్ని కోట్లో తెలుసా? - Gautam Gambhir Networth

రోహిత్ పర్సనల్ మేనేజర్​ ఆమెనే! - హిట్​మ్యాన్​ సతీమణి నెట్​వర్త్ ఎంతంటే ? - Rohit Sharma Wife Net Worth

ABOUT THE AUTHOR

...view details