ETV Bharat / sports

'కింగ్​' కోహ్లీ సూపర్​ సెంచరీ - 487/6 వద్ద ఇండియా డిక్లేర్డ్​ - ఆస్ట్రేలియా టార్గెట్ 534

80వ సెంచరీ బాదిన కింగ్ కోహ్లీ - 487/6 వద్ద ఇండియా డిక్లేర్డ్ - ఆస్ట్రేలియా టార్గెట్ 534

IND VS AUS 1ST TEST 2024
IND VS AUS 1ST TEST 2024 (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

IND VS AUS 1ST TEST 2024 : ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమ్​ ఇండియా భారీ స్కోరుతో డిక్లేర్‌ చేసింది. ఆస్ట్రేలియా ఎదుట 534 పరుగుల టార్గెట్​ను ఉంచింది. విరాట్‌ కోహ్లీ (100*), యశస్వి జైస్వాల్‌ (161) సెంచరీలతో అదరగొట్టారు. దీంతో ఆరు వికెట్లు కోల్పోయి 487 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ (77) అర్ధశతకం సాధించగా, పడిక్కల్‌ (25), సుందర్‌ (29) ఫర్వాలేదనిపించారు. నితీశ్‌ (38*) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 150 పరుగులు చేయగా, ఆసీస్‌ 104 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత్‌కు 46 పరుగుల ఆధిక్యం లభించింది. ఆసీస్ బౌలర్లలో నాథన్ లైయన్ రెండు, స్టార్క్‌, హేజిల్‌వుడ్, కమిన్స్‌, మిచెల్ మార్ష్‌ తలో వికెట్ పడగొట్టారు.

కోహ్లీ 80వ సెంచరీ- 16నెలల దాహం తీరింది!
'కింగ్​' కోహ్లీ తన 80వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతను 143 బంతుల్లో మూడంకెల స్కోరు అందుకున్నాడు. కోహ్లీ 16 నెలల తర్వాత టెస్టుల్లో శతకం బాదడం విశేషం. ఇది టెస్టుల్లో కోహ్లీకి 30వ శతకం. కోహ్లీ సెంచరీ పూర్తి కాగానే భారత్‌ రెండో ఇన్నింగ్స్‌ను 487/6 వద్ద డిక్లేర్ చేసింది. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా ఆసీస్‌ ముందు 534 పరుగుల టార్గెట్‌ను ఉంచింది.

సచిన్ రికార్డ్​ బ్రేక్
ఆసీస్​ గడ్డపై అత్యధిక టెస్టు సెంచరీలు సాధించిన ఆసియా క్రికెటర్‌గా కింగ్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాలో కోహ్లీ ఏడు సెంచరీలు బాదాడు. అంతకుముందు ఈ రికార్డు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ పేరిట ఉండేది. ఆసీస్​లో తెందూల్కర్ ఆరు సెంచరీలు. ఇక అన్ని ఫార్మాట్లలో కలిసి ఆసీస్​పై కోహ్లీ చేసిన10వ సెంచరీ ఇది. విజిటింగ్ బ్యాటర్లలో మరే క్రికెటర్ ఈ ఘనత సాధించలేదు.

ప్రత్యర్థులపై అత్యధిక టెస్ట్​ సెంచరీలు చేసిన వీరులు వీరే
ఈ జాబితాలో సునిల్ గవాస్కర్ ముందున్నాడు. సునిల్ వెస్టిండీస్​పై అత్యధికంగా 13 సెంచరీలు చేశాడు. ఆస్ట్రేలియాపై 8 సెంచరీలు చేశాడు. ఇక సచిన్ తెందూల్కర్ ఆస్ట్రేలియాపై 13 సెంచరీలు, శ్రీలంకపై 9 సెంచరీలు బాదాడు. తాజా శతకంతో విరాట్​ కోహ్లీ ఆస్ట్రేలియాపై 9 సెంచరీలు చేశాడు.

పీకల్లోతి కష్టాల్లో కంగారూలు!
సెకండ్ ఇన్నింగ్స్‌ ఆరంభించిన కంగారూలు పీకల్లోతు కష్టాల్లో కూరుకున్నారు. టీమ్​ఇండియా పేసర్లు ఆదిలోనే వరుస షాక్‌లు ఇచ్చారు. తొలి ఓవర్‌లోనే మెక్‌స్వినీ (0)ని బుమ్రా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. నైట్‌ వాచ్‌మెన్‌గా వచ్చిన పాట్ కమిన్స్ (2) సిరాజ్‌ బౌలింగ్‌లో స్లిప్‌లో కోహ్లీకి చిక్కాడు. మార్నస్ లబుషేన్ (3)ని బుమ్రా ఎల్​బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. దీంతో ఆసీస్‌ 12/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది. దీంతో భారత్ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. నాలుగో రోజు ఆరంభంలోనే మరిన్ని వికెట్లు తీస్తే రెండు సెషన్లలోపే మ్యాచ్‌ ముగిసే అవకాశం ఉంది.

Last Updated : 2 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.