Shreyas Iyer IPL Record : ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ రికార్డులన్నీ తిరగరాశాడు. ఐపీఎల్ చిత్రలో అత్యధిక ధర పలికి చరిత్ర సృష్టించాడు. అతడిని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసింది. పంత్ కోసం లఖ్‌నవూ, బెంగళూరు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరకు లఖ్‌నవూ రికార్డు ధరకు అతడిని దక్కించుకుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు అత్యధిక ధర పలికిన భారత ప్లేయర్‌గా కూడా పంత్ రికార్డుకెక్కాడు.
𝗥𝗲𝗰𝗼𝗿𝗱-𝗯𝗿𝗲𝗮𝗸𝗶𝗻𝗴 𝗥𝗶𝘀𝗵𝗮𝗯𝗵 🔝
— IndianPremierLeague (@IPL) November 24, 2024
Snippets of how that Historic bidding process panned out for Rishabh Pant 🎥 🔽 #TATAIPLAuction | #TATAIPL | @RishabhPant17 | @LucknowIPL | #LSG pic.twitter.com/grfmkuCWLD
మరో భారత ఆటగాడు శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ చరిత్రలో రెండో కాస్ట్లీ ప్లేయర్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. రూ.26.75 కోట్లకు శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కొనుగోలు చేసింది. అయితే, పంజాబ్- శ్రేయస్‌ను కొనుగోలు చేసిన కొద్దిసేపటికే అత్యధిక ధరకు లఖ్‌నవూ పంత్‌ను దక్కించుకుంది.
𝙃𝙞𝙨𝙩𝙤𝙧𝙞𝙘 𝙎𝙞𝙜𝙣𝙞𝙣𝙜 𝙐𝙣𝙡𝙤𝙘𝙠𝙚𝙙 🔓
— IndianPremierLeague (@IPL) November 24, 2024
Say hello 👋 to the 𝙈𝙤𝙨𝙩 𝙀𝙭𝙥𝙚𝙣𝙨𝙞𝙫𝙚 𝙋𝙡𝙖𝙮𝙚𝙧 in the history of #TATAIPL 🔝
Punjab Kings have Shreyas Iyer on board for a handsome 𝗜𝗡𝗥 𝟮𝟲.𝟳𝟱 𝗖𝗿𝗼𝗿𝗲#TATAIPLAuction | @ShreyasIyer15 | @PunjabKingsIPL pic.twitter.com/z0A1M9MD1Z
కనీస ధర రూ.2 కోట్లు ఉన్న భారత పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసింది. మొదట్లో చెన్నై సూపర్ కింగ్స్, దిల్లీ క్యాపిటల్స్ అతడి కోసం తీవ్రంగా పోటీ పడ్డాయి. మధ్యలో గుజరాత్, బెంగళూరు, రాజస్థాన్ కూడా అతడి కోసం పోటీగా బిడ్ వేశాయి. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ రంగంలోకి దిగాయి. చివరకు ఆర్‌టీఎమ్ కార్డును ప్రయోగించి పంజాబ్ రూ.18 కోట్లకు అర్ష్‌దీప్‌ను కొనుగోలు చేసింది.
మిగతా కొనుగోళ్లు
- సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడా(కనీస ధర రూ. 2 కోట్లు) - రూ.10.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
- ఇంగ్లాండ్ బ్యాట్ జోస్ బట్లర్ (కనీస ధర రూ. 2 కోట్లు) - రూ.15.75 కోట్లు (గుజరాత్ టైటాన్స్)
ఐపీఎల్లో టాప్ - 7 భారీ కొనుగోళ్లు
- రిషభ్ పంత్ (భారత్) - రూ.27కోట్లు - లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (2025)
- శ్రేయస్ అయ్యర్ (భారత్) - రూ.26.75 కోట్లు - పంజాబ్ కింగ్స్ (2025)
- మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)- రూ. 24.75 కోట్లు- కోల్‌కతా నైట్‌రైడర్స్ (2024)
- ప్యాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా)- రూ. 20.50 కోట్లు- సన్‌రైజర్స్ హైదరాబాద్ (2024)
- శామ్ కరన్ (ఇంగ్లాండ్) - రూ. 18.50 కోట్లు- పంజాబ్ కింగ్స్ (2023)
- కామెరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా)- రూ. 17.50 కోట్లు- ముంబయి ఇండియన్స్ (2023)
- బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్) - రూ. 16.25 కోట్లు- చెన్నై సూపర్‌కింగ్స్ (2023).