LIVE : తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో 'తెలుగు వెలుగు' - ప్రత్యక్ష ప్రసారం - 74 TANA WORLD LITERARY FORUM LIVE
🎬 Watch Now: Feature Video
Published : Nov 24, 2024, 8:20 PM IST
|Updated : Nov 24, 2024, 10:48 PM IST
TANA World Literary Forum LIVE : తానా(ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సాహిత్య విభాగం 'తానా ప్రపంచ సాహిత్య వేదిక' ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహించే సాహిత్య సమావేశాల పరంపరలో నేడు 74వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో “మన భాష – మన యాస”, “మాండలిక భాషా అస్తిత్వం” సదస్సు ఘనంగా జరుగుతోంది. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అతిథులను సాదరంగా ఆహ్వానించి సదస్సును ప్రారంభించారు. అక్షర సేద్యంతో తెలుగునాట చెరగని ముద్రవేసిన సాహితీ రుషులను స్ఫూర్తిగా తీసుకొని తెలుగు భాషను సుసంపన్నం చేసుకోవాలని సాహితీ వేత్తలు పిలుపునిచ్చారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం - తానా ఆధ్యర్యంలో 'నెల నెలా తెలుగు వెలుగు' పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం నిర్వహిస్తారు. అందులో భాగంగానే “మన భాష – మన యాస”, “మాండలిక భాషా అస్తిత్వం” అనే అంశంపై చర్చిస్తున్నారు.
Last Updated : Nov 24, 2024, 10:48 PM IST