తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్లేఆఫ్స్ చేరాలంటే ముంబయి ఆ పని కచ్చితంగా చేయాల్సిందే! - IPL 2024

Mumbai Indians IPL 2024 : ఈ ఏడాది ఐపీఎల్ సీజన్​లో పేలవ ఫామ్​తో నెట్టింట విమర్శలు అందుకుంటోంది ముంబయి ఇండియన్స్ జట్టు. ఇటీవలె రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లోనూ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో రానున్న ప్లే ఆఫ్స్ విషయంలో ఈ జట్టుకు అవకాశాలు ఎలా ఉన్నాయంటే ?

Mumbai Indians IPL 2024
Mumbai Indians IPL 2024

By ETV Bharat Telugu Team

Published : Apr 23, 2024, 3:53 PM IST

Mumbai Indians IPL 2024 : ఐపీఎల్‌ 17 సీజన్‌లో ముంబయి ఇండియన్స్‌ ఆటతీరు అంతంతమాత్రంగా ఉంది. సీనియర్ ప్లేయర్లు, దూకుడుగా ఆడే యంగ్​స్టర్స్ అంతా కూడా ఈ సీజన్​లో పేలవ ఫామ్​ను కనబరుస్తున్నారు. సోమవారం రాజస్థాన్​తో జరిగిన మ్యాచ్​లోనూ ఈ జట్టు గట్టు ఎక్కలేకపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అయితే ఇదే లక్ష్యాన్ని రాజస్థాన్‌ ఒకే వికెట్ కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది.

ఇదిలా ఉండగా, ఈ తాజాగా ఓటమి వల్ల ప్లే ఆఫ్స్​లో తమ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది ముంబయి జట్టు. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన హార్దిక్ సేన అందులో మూడింట మాత్రమే గెలుపొందింది. పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానంతో సరిపెట్టుకుంది.

అయితే ఈ సీజన్​లో ముంబయి మరో 6 మ్యాచ్‌లే ఆడాల్సి ఉంది. దీంతో ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ ఆరు మ్యాచ్‌ల ఆ జట్టుకు కీలకం కానుంది. అన్నింటిలోనూ గెలవాల్సిందే. ఒక్క మ్యాచ్​లో ఓడినా కూడా రన్‌రేట్​లో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్లేఆఫ్స్​ ఛాన్స్ ఉంది. కానీ రెండింట్లో ఓడితే మాత్రం ఇక ప్లేఆఫ్స్ ఆశలు వదులుకోవాల్సిందే.

ప్రస్తుతం ముంబయి జట్టు పర్ఫామెన్స్ చూస్తుంటే, ఈ ఆరు మ్యాచుల్లో 5 గెలవడమే అసాధ్యంగా అనిపిస్తోంది. దీంతో ఏదైన మ్యాజిక్ జరిగి, జట్టు తిరిగి ఫామలోకి వస్తే తప్ప ముంబయి టీమ్ ఆఫ్స్ చేరే అవకాశం లేదని విశ్లేషకుల మాట. ఇక ముంబయి రానున్న మ్యాచుల్లో లఖ్​నవూ సూపర్ జెయింట్స్​, కోల్​కతా నైట్​ రైడర్స్​తో చెరో రెండు మ్యాచ్​లు ఆడనుంది.

ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్, దిల్లీ క్యాపిటల్స్​తో ఒక్కో మ్యాచ్​లో తలపడనుంది. ఇందులో దిల్లీ తప్ప మిగతా అన్ని టీమ్స్​ మంచి ఫామ్​లో ఉన్నవే. దీంతో ముంబయి ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి కచ్చితంగా ముంబయి ఫ్లే ఆఫ్స్​ చేరుకోవాలని కోరుకుంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో ?

రోహిత్ ఖాతాలో పలు రికార్డులు- ఆ లిస్ట్​లో టాప్​లోకి హిట్​మ్యాన్ - IPL 2024

ఆల్​రౌండర్​గా ఫెయిల్​- నెట్టింట ట్రోలింగ్- అయినా బౌలింగ్ కంటిన్యూ​- ఎందుకంటే? - Hardik Pandya IPL 2024

ABOUT THE AUTHOR

...view details