MS Dhoni CSK :2008లో మొదలైనతొలిఐపీఎల్ సీజన్ నుంచి ఇప్పటి 17 సీజన్ వరకు అన్నింటిలో విజయవంతంగా కొనసాగుతున్న అతికొద్ది మంది ప్లేయర్లలో మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ ఒకరు. చెన్నైసూపర్ కింగ్స్ జట్టుకు సారథ్య బాధ్యతలు వహిస్తూనే జట్టులో కీలక ప్లేయర్‌గా కొనసాగిన ధోనీ ఈ సీజన్‌కు తన కెప్టెన్సీ బాధ్యతలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పజెప్పాడు. కానీ చెన్నై జట్టు అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అవ్వడానికి కారణం అతడే.
ఓ బ్యాట్స్‌మెన్‌గానే కాకుండా సూపర్ వికెట్ కీపర్‌గా రాణిస్తూ జట్టును ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు. ఈ సీజన్లోనూ మునుపటిలా అదరగొడుతున్నాడు. 42 ఏళ్ల వయసులోనూ 'ఫినిషింగ్' టచ్ ఇస్తూ వింటేజ్ ధోనీని గుర్తుచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతడి సక్సెస్ వెనుక ఉన్న కారణం గురించి ధోనీనే స్వయంగా తెలిపాడు. గతంలో స్వయంగా అతడే చెప్పిన ఓ పాత వీడియోను ఇప్పుడు ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
"ఇప్పుడు నేను చెప్పనున్న ఆన్సర్ కొందరికి అసంబద్ధంగా ఉండొచ్చేమో. కానీ, గత కొన్నేళ్లుగా నేను ఫాలో అవుతున్న టైమ్ టేబుల్ మాత్రం ఇదే. అది నాకు ఎంతో సాయంగా నిలిచింది. ఐపీఎల్ టోర్నీ ప్రారంభానికి సుమారు ఐదు లేదా ఆరు రోజుల ముందు నుంచే నేను మానసికంగా సిద్ధమవుతాను. ఒక్కోసారి రాత్రి 12 తర్వాత మేం తిరిగి ఫ్లైట్‌ను అందుకోవాల్సి ఉంటుంది. దీంతో ప్రతిసారి నేను లేట్‌గా పడుకోవాల్సిన పరిస్థితి. మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం రాత్రి 8 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత నా కిట్ బ్యాగ్‌ను నేను రెడీ చేసుకోవాలి. లేట్‌గానే భోజనం చేయాలి. దీంతో హోటల్ రూమ్‌కు చేరుకునే సరికి అప్పుడప్పుడు రాత్రి 1.15 అయిపోతుంది. వెంటనే ప్యాక్ చేసుకోవాలి. దీంతో దాదాపు 2.30 అయిపోతుంది. మామూలు రోజుల్లో రాత్రి 10 గంటలకు నిద్రపోయి ఆరింటికల్లా లేస్తుంటారు. కానీ నేను మాత్రం 3 గంటలకు పడుకొని ఉదయం 11 గంటలకు లేస్తాను. కనీసం 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకుంటాను. మ్యాచ్‌లు లేని సమయంలో మాత్రం టైమ్‌కు పడుకునేందుకు ప్రయత్నిస్తుంటాను. అందుకే, ఐపీఎల్ ముగిసినా కూడా నాకు అలసట అనిపించదు" అంటూ తన టైమ్ టేబుల్‌ను ఆ వీడియోలో వివరించాడు.
ధోనీ గురించి శివమ్ దూబె వైఫ్ పోస్ట్ - 'ఆయన కోసం ఇంకాస్త ఎక్కువ అరుస్తాను' - Shivam Dube Wife Emotional Post
ధోనీ ధనాధన్ హిట్టింగ్- 42 ఏళ్ల ఏజ్‌లోనూ తగ్గేదేలే - IPL 2024