తెలంగాణ

telangana

ETV Bharat / sports

విరాట్, రోహిత్​కు కొలిసొచ్చిన హోం గ్రౌండ్స్​- ఈ వేదికల్లో దబిడి దిబిడే - Most Runs A Single Venue IPL

Most Runs Single Venue IPL: దేశంలో ఐపీఎల్ ఫీవర్ షురూ అయ్యింది. శుక్రవారం నుంచి ఈ మెగా టోర్నీ జరగబోతోంది. ఈ ఐపీఎల్ కోసం ప్రపంచం వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. కాగా ఐపీఎల్ హిస్టరీలో ఒకే వేదికపై అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరో తెలుసా?

Most Runs A Single Venue IPL
Most Runs A Single Venue IPL

By ETV Bharat Telugu Team

Published : Mar 20, 2024, 3:15 PM IST

Most Runs Single Venue IPL: 2024 ఐపీఎల్ మార్చి 22న ప్రారంభం కాబోతోంది. చెన్నైసూపర్ కింగ్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మ్యాచ్​తో 17వ సీజన్​కు తెర లేవనుంది. అయితే ఐపీఎల్ అంటే కావాల్సినంత వినోదంతోపాటు పరుగుల మోతా ఉంటుంది. ఇక హోం గ్రౌండ్​లో మ్యాచ్​ జరిగితే ఆ జట్టుకు ఎక్స్​ట్రా అడ్వాంటేజ్​గా చెప్పవచ్చు. దాదాపు గ్రౌండ్​లోని క్రౌడ్ అంతా లోకల్ జట్టుకే సపోర్ట్​గా ఉంటుంది. అందుకే ఆయా ప్లేయర్లు కూడా సొంద మైదానంలో రెచ్చిపోతుంటారు. అలా ఒక్కొక్కరికి ఒక్కో ఫేవరెట్ గ్రౌండ్​ కూడా ఉంటుంది. అయితే గడిచిన 16 సీజన్​ల​లో ఒకే వేదికపై అత్యధిక పరుగులు చేసిన టాప్- 5 బ్యాటర్లు ఎవరో తెలుసా? మరి ఆ వేదికలు ఏవి? వారెవరు?

  • విరాట్@ చిన్నస్వామి స్టేడియం:ఐపీఎల్ చరిత్రలో ఒక వేదికపై అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్లలో విరాట్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో 2,700 పరుగులు సాధించాడు. 16 సీజన్​లుగా ఆర్సీబీ జట్టుకే ఆడుతున్న విరాట్​కు సొంత మైదానం బాగా కలిసి వచ్చింది. చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ మ్యాచ్​ అనగానే విరాట్ ఫ్యాన్స్​కు పండగే.
  • రోహిత్ శర్మ@ వాంఖడే:ముంబయి ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ లిస్ట్​లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. 2011 నుంచి ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్​కు కూడా సొంత మైదానం అచ్చొచ్చింది. రోహిత్ ముంబయి వాంఖడేలో ఇప్పటిదాకా 2020 పరుగులు బాదాడు. ఐపీఎల్​లో వాంఖడే మ్యాచ్​లో రోహిత్​తో
  • డివిలియర్స్ @ చిన్నస్వామి స్టేడియం:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ కూడా చిన్నస్వామి స్టేడియంలో బీభత్సం సృష్టించాడు. ఆర్సీబీ తరఫున అడిన డివిలియర్స్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో పరుగుల వరద పారించాడు. అతడు 1960 పరుగులు చేసి ఈ లిస్ట్​లో మూడో స్థానంలో నిలిచాడు.
  • వార్నర్ @ ఉప్పల్ స్టేడియం హైదరాబాద్:డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఐపీఎల్​లో దిల్లీ, హైదరాబాద్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలో అతడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో 1623 పరుగులు చేశాడు.
  • గేల్ @ చిన్నస్వామి స్టేడియం:వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ క్రీజులోకి దిగాడంటే సిక్సర్లతో మోత మోగిస్తుంటాడు. క్రిస్ గేల్ ఆటకు మైదానం చప్పట్లు, కేరింతలో మారుమ్రోగుతుంది. అతడు ఐపీఎల్​లో బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో 1561 పరుగులు చేసి ఈ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఇలా ఒకే వేదికపై అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మెన్ లుగా ఐపీఎల్ చరిత్రలో నిలిచారు.

ABOUT THE AUTHOR

...view details