Mohammad Rizwan Champions Trophy 2025 : కొత్తగా పాకిస్థాన్ టెస్ట్ టీమ్ కెప్టెన్ అయిన మహ్మద్ రిజ్వాన్ భారత ఆటగాళ్లకు స్వాగతం పలికి అందరి హృదయాలు గెలుచుకున్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాక్‌లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మొత్తం జట్టుతో పాకిస్థాన్‌లో పర్యటించాలని కోరుతూ భారత ఆటగాళ్లు కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌కు వెల్‌కమింగ్ మెసేజ్ పంపాడు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనడానికి భారత్ పాకిస్థాన్‌కు వెళ్లబోదని ఐసీసీ అధికారికంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కి తెలియజేయడం వల్ల గందరగోళం నెలకొంది. ఈ తరుణంలో రిజ్వాన్ టీమ్ఇండియాను ఆహ్వానించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20ఐ సిరీస్ ప్రారంభానికి ముందు బుధవారం బ్రిస్బేన్‌లోని గబ్బా వద్ద మీడియాతో రిజ్వాన్ మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లకు స్వాగతం పలికాడు. ప్రస్తుతం నెలకొన్న గందరగోళం త్వరగా పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
భారత్‌కి ఆహ్వానం
మీడియా ముందు రిజ్వాన్, "కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్‌కు స్వాగతం. వచ్చే ఆటగాళ్లందరికీ స్వాగతం పలుకుతాం. ఇది మా నిర్ణయం కాదు, పీసీబీ నిర్ణయం. ఏ నిర్ణయం తీసుకున్నా అందరూ చర్చించి సరైన పిలుపునిస్తారని ఆశిస్తున్నాను. కానీ భారత ఆటగాళ్లు వస్తారనే ఆశాభావంతో ఉన్నాం' అని చెప్పాడు.