తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఉప్పల్‌ ఊగిపోయింది - ముంబయిపై సన్​రైజర్స్​ అద్భుత విజయం - MI VS SRH IPL 2024

MI VS SRH IPL 2024 : ఐపీఎల్​ 17 సీజన్​లో భాగంగా తాజాగా ఉప్పల్​ వేదికగా జరిగిన మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరబాద్ రికార్డ్​ స్థాయిలో అదరగొట్టింది. ముంబయి జట్టును ఓడించింది.

MI VS SRH IPL 2024
MI VS SRH IPL 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 27, 2024, 11:00 PM IST

Updated : Mar 28, 2024, 6:25 AM IST

MI VS SRH IPL 2024 :ఐపీఎల్​ 17వ సీజన్​లో భాగంగా తాజాగా హోం గ్రౌండ్​లో జరిగిన మ్యాచ్​లో ముంబయి ఇండియన్స్​పై సన్​రైజర్స్ హైదరాబాద్ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. హైదరాబాద్​లోని ఉప్పల్ వేదికగా ఆడిన మ్యాచ్​లో అద్వితీయమైన బ్యాటింగ్‌తో అదరగొట్టేసింది. బ్యాటర్లు మెషీన్‌ గన్నుల్లా పేలి ఐపీఎల్ చరిత్రలోనే నిలిచిపోయే ఇన్నింగ్స్ ఆడారు. హార్దిక్ సేనను 31 పరుగుల తేడాతో ఓడించారు.

ట్రావిస్‌ హెడ్‌ (24 బంతుల్లో 9×4, 3×6 సాయంతో 62 పరుగులు), అభిషేక్‌శర్మ (23 బంతుల్లో 3×4, 7×6 సాయంతో 63 పరుగులు), మార్‌క్రమ్‌ (28 బంతుల్లో 2×4, 1×6 సాయంతో 42 నాటౌట్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌ (34 బంతుల్లో 4×4, 7×6 సాయంతో 80 నాటౌట్‌) ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. దీంతో ఒక్క సెంచరీ కూడా నమోదు చేయకుండానే సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్లకు 277 పరుగుల రికార్డు స్కోరును చేసింది. ముంబయి బౌలర్లలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, కోయెట్జీ, పీయూష్‌ చావ్లా ఒక్కో వికెట్‌ తీశారు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబయి ఇండియన్స్​ చివర్లో కాస్త తడబడింది. 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 246 రన్స్ చేసింది. హైదరాబాదీ ప్లేయర్ తిలక్‌వర్మ (34 బంతుల్లో 2×4, 6×6 పరుగులు సాయంతో 64), టిమ్‌ డేవిడ్‌ ( 22 బంతుల్లో 2×4, 3×6 సాయంతో 42 నాటౌట్‌), ఇషాన్‌ కిషన్‌ (13 బంతుల్లో 2×4, 3×6 సాయంతో 34) పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. సన్​రైజర్స్​ బౌలింగ్​లో ఉనద్కత్‌ 2, కమిన్స్‌ 2, షాబాజ్‌ అహ్మద్‌ 1 వికెట్లు తీశారు.

ముంబయి తుది జట్టు : ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నమన్ ధీర్‌, తిలక్ వర్మ, పీయూష్ చావ్లా, హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), టిమ్ డేవిడ్, కోయెట్జీ, షామ్స్ ములానీ, జస్ప్రీత్ బుమ్రా, క్వెనా మఫాకా

సబ్‌స్టిట్యూట్స్‌: డెవాల్డ్‌ బ్రెవిస్, నెహాల్ వధేరా, రొమారియో షెఫర్డ్, నబీ, విష్ణు వినోద్.

సన్​రైజర్స్ హైదరాబాద్‌ తుది జట్టు : ట్రావిస్‌ హెడ్, మయాంక్ అగర్వాల్, అభిషేక్‌ శర్మ, ఏడన్ మార్‌క్రమ్‌, హెన్​రిచ్​ క్లాసెన్, మయాంక్ మార్కండే, అబ్దుల్‌ సమద్, షాబాజ్ అహ్మద్, కమిన్స్ (కెప్టెన్‌), భువీ, జయదేవ్ ఉనద్కత్

సబ్‌స్టిట్యూట్స్‌:వాషింగ్టన్‌ సుందర్, నితీశ్‌ రెడ్డి, ఉమ్రాన్‌ మాలిక్, గ్లెన్‌ ఫిలిప్స్‌, ఉపేంద్ర యాదవ్

ఐపీఎల్​లో హిట్​మ్యాన్ మరో అరుదైన రికార్డు - అప్పుడు ధోనీ, సచిన్ - ఇప్పుడు రోహిత్ - Rohit Sharma 200th IPL

విరాట్​ ఫ్యాన్​కు సెక్యూరిటీ షాక్​- గతంలోనూ ఇలా చాలా సార్లు! - Virat Fan Beaten by Security

Last Updated : Mar 28, 2024, 6:25 AM IST

ABOUT THE AUTHOR

...view details