MI vs KKR IPL 2024:ఐపీఎల్ 2024లో ఇక ముంబయి ఇండియన్స్‌కు ఫలితాల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి కసరత్తులు చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ సీజన్లో ముంబయి కథ ముగిసింది! పేలవ ప్రదర్శనతో తాజాగా ఎనిమిదో ఓటమిని ఖాతాలో వేసుకుంది. దీంతో ముంబయికి ప్లేఆఫ్స్‌కు దారులు మూసుకుపోయాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన కోల్‌కతా 12ఏళ్ల తర్వాత తొలిసారి ముంబయిలో ఎమ్ఐపై గెలవడం విశేషం.
170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయి మ్యాచ్‌ను గొప్పగా ఆరంభించినా, ఆ తర్వాత పట్టు కోల్పోయి కోల్‌కతాకు మ్యాచ్‌ను సమర్పించుకుంది. 18.5 ఓవర్లలో 145 పరుగులకే కుప్పకూలింది. సూర్యకుమార్ యాదవ్ (56; 35 బంతుల్లో 6×4, 2×6) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగితా వారు విఫలమయ్యారు. స్టార్క్ (4/33)కు తోడు వరుణ్ చక్రవర్తి (2/22), నరైన్ (2/22), రసెల్ (2/30) విజృంభించడం వల్ల ముంబయి బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటైంది. వెంకటేశ్ అయ్యర్ (70 పరుగులు) భారీ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, మనీశ్ పాండే (42 పరుగులు) రాణించారు. ఈ ఇద్దరు మినహా కేకేఆర్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. ఓపెనర్లు పిల్ సాల్ట్ (5), సునీల్ నరైన్ (8), రఘువంశీ (13), శ్రేయస్ అయ్యర్ (6), రింకూ సింగ్ (9), అండ్రూ రస్సెల్ (7) స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేరారు. ముంబయి బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషారా చెరో 3, హార్దిక్ పాండ్య 2, పీయుశ్ చావ్లా 1 వికెట్ దక్కించుకున్నారు.