Mayank Yadav IPL 2024:ప్రతి ఐపీఎల్ సీజన్‌లో కొందరు కొత్త యంగ్ టాలెంటెడ్ క్రికెటర్‌లు వెలుగులోకి వస్తుంటారు. గతంలో బుమ్రా, హార్దిక్, జైశ్వాల్, గిల్, సిరాజ్ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. ఇక 2023లో రింకూ సింగ్ వెలుగులోకి రాగా, తాజా సీజన్‌లో లఖ్‌నవూ పేస్ బౌలర్ మయంక్ యాదవ్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
లఖ్‌నవూ గత రెండు మ్యాచ్‌ల్లో బంతితో అదరగొట్టి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గానూ నిలిచాడు మయంక్. ఈ క్రమంలో ఐపీఎల్ కెరీర్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో 3+ వికెట్లు దక్కించుకున్న ఆరో బౌలర్‌గా మయంక్ రికార్డు కొట్టాడు. అతడి కంటే ముందుగా లసిత్ మలింగ, అమిత్ మిశ్రా, మయంక్ మార్కండే, కూపర్, జోఫ్రా ఆర్చర్ ఈ ఘనత సాధించారు.
లఖ్‌నవూకు స్టార్ దొరికినట్లే!
ప్రస్తుత సీజన్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ జట్టుకు మయాంక్ యాదవ్ కీలక ప్లేయర్‌గా మారాడు. ముఖ్యంగా స్టార్ బౌలర్లు మార్క్ వుడ్, డేవిడ్ విల్లీ సేవలు టీమ్‌కి దూరమయ్యాయి. సీజన్ ప్రారంభానికి ముందు, 2024 ఐపీఎల్‌లో పేసర్ మయంక్ కీలక పాత్ర పోషిస్తాడని LSG హెడ్ కోచ్, జస్టిన్ లాంగర్ చెప్పాడు. ఇక తాజాదా పంజాబ్, బెంగళూరు మ్యాచ్‌ల్లో మయాంక్ స్పీడ్ చూసిన నెటిజన్లు మార్క్ వుడ్ అవసరం లేదని, లఖ్‌నవూకు స్టార్ దొరికాడని కామెంట్లు చేస్తున్నారు.
బౌలింగ్ సంచలనం
లఖ్‌నవూ గత రెండు మ్యాచ్‌ల్లో మయంక్ ఆటే హైలైట్. ముఖ్యంగా పంజాబ్‌తో మ్యాచ్‌లో మయంక్ బౌలింగ్‌లో అదుర్స్ అనిపించాడు. ఆ మ్యాచ్‌లో 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ 10 ఓవర్లకు 98-0 పటిష్ఠ స్థితిలో నిలిచి గెలుపు దిశగా సాగింది. అలాంటి దశలో కెప్టెన్ మయాంక్ యాదవ్ చేతికి బంతినిచ్చాడు. అంతే అతడు పరగులు నియంత్రించడమే కాకుండా, క్రమంగా వికెట్లు తీయడమే పడగొట్టి లఖ్‌నవూకు విజయం అందించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన మయంక్ 27 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక తాజాగా బెంగళూరుతో మ్యాచ్‌లో విజయంలోనూ మయంక్దే కీలక పాత్ర. ఆర్సీబీ టాపార్డర్ రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్‌ను పెవిలియన్ చేర్చి ప్రత్యర్థి జట్టను దెబ్బకొట్టాడు. అందులో ఓ అద్భుత బంతికి గ్రీన్ క్లీన్ బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్‌లోనూ 3 వికెట్లతో రాణించిన మయంక్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు దక్కింది.
ఫాస్టెస్ట్ బాల్ 2024
ప్రస్తుత టోర్నీలో అత్యంత వేగవంతమైన బాల్ వేసింది మయాంకే. పంజాబ్ మ్యాచ్‌లో తను వేసిన 155.8 kmph స్పీడ్ రికార్డ్‌ను తానే ఆర్సీబీ మ్యాచ్‌లో బద్దలుకొట్టాడు. తాజా మ్యాచ్‌లో మయంక్ 165.7 kmphతో బౌలింగ్ చేశాడు. అయితే మయాంక్ యాదవ్, భారతదేశానికి తొలి అల్ట్రా- స్పీడ్‌స్టర్ కాదు. ప్రస్తుతం వరుణ్ ఆరోన్, ఉమ్రాన్ మాలిక్ వంటి వాళ్లు ఉన్నారు. అయితే ఇలాంటి వాళ్లకి గాయాలే ప్రధాన సమస్య. మయాంక్ వయస్సు, ఫిట్నెస్ చూస్తే ఎక్కువ కాలం బౌలింగ్ చేయగలడు.
ఈ పేసర్లు యమ స్పీడు- బంతి విసిరితే 150+kmph పక్కా!- IPLలో టాప్ 5 ఫాస్టెస్ట్ బాల్స్ - Fastest Ball In IPL
నయా స్పీడ్ గన్‌కు షూ స్పాన్సర్లు లేరట!- మయంక్ టార్గెట్ అదే - Mayank Yadav IPL 2024