Mayank Yadav LSG Favourite Bowler : ఐపీఎల్‌లో ఓ కొత్త చరిత్ర నమోదమైంది. రాత్రికి రాత్రి కొత్త స్టార్ వెలుగులోకి వచ్చాడు. సోషల్ మీడియాలో క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఎక్కడ చూసినా లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ ప్లేయర్ మాయంక్ యాదవ్ పేరు మార్మోగుతోంది. ఇటీవలే జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్లల్లో 27 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకుని ఆ జట్టు గెలుపులో కీలకపాత్ర పోషించాడు.
ఈ పెర్ఫామెన్స్‌తో మయాంక్ యాదవ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. 18 బంతులను 145 కిలో మీటర్లకు పైగా వేగంతో, స్థిరంగా బౌలింగ్ చేసి మయాంక్ యాదవ్ క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. అంతలా ఈ సీమర్ ఎంత స్థిరంగా బౌలింగ్ చేశాడో ఊహించలేం. ఇందులో ఎనిమిది బంతులు 150 కిలోమీటర్లకు పైగా వేగాన్ని రికార్డ్ చేశాయంటే అతడి బౌలింగ్ ఏ స్థాయిలో సాగిందో చూసిందో తెలుసుకోవచ్చు. మయాంక్ యాదవ్ వేసిన ఓ బంతి 155.8 కిలోమీటర్లను టచ్ చేసింది. ఈ సీజన్‌లో ఇదే స్పీడ్ డెలివరి. తొలి మ్యాచ్‌లోనే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా దక్కించుకున్నాడు మాయాంక్ యాదవ్. గత ఏడాదే ఐపీఎల్‌కు ఎంపికైనా మయాంక్ గాయం వల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. మయాంక్‌ను ఇప్పుడు రాజధాని ఎక్స్‌ప్రెస్‌గా పిలుస్తున్నారు.
నా ఆరాధ్య క్రికెటర్ అతడే
తన పెర్ఫామెన్స్‌పై పేసర్ మయాంక్ యాదవ్ హర్షం వ్యక్తం చేశాడు. తన ఆరాధ్య బౌలర్ ఎవరో కూడా చెప్పేశాడు. దక్షిణాఫ్రికా సీమర్ డేల్ స్టెయిన్‌ను తాను ఆరాధిస్తానని మయాంక్ తెలిపాడు. స్టెయిన్ వేగం, స్థిరమైన బౌలింగ్ అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించాడు. మయాంక్ యాదవ్ మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించాడు.