Manu Bhaker Special Interview : పారిస్ ఒలింపిక్స్‌లో విజేతగా నిలిచి భారత్‌కు రెండు కాంస్య పతకాలు తెచ్చిపెట్టింది షూటర్ మను బాకర్. విశ్వ క్రీడల్లో అంచనాలకు మించి పెర్ఫామ్ చేసి అందరినీ అబ్బురపరిచింది. దీంతో అందరి దృష్టి ఇప్పుడీ ప్లేయర్‌పై పడింది. చాలా మంది తన లైఫ్‌స్టైల్, కెరీర్ గోల్స్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్య్యూలో తన గురించి మను చెప్పుకున్న పలు సంగతులు తన మాటల్లోనే
- టోక్యో ఒలింపిక్స్ నాకు చాలా పాఠాలు నేర్పింది. ఆ వైఫల్యాన్ని దాటుకుని నేను ముందుకు సాగాలని అనుకున్నప్పటికీ రోజు రోజుకూ అది మరింత కఠినంగా మారింది. ఆ సమయంలోనే నేను ఓ టాటూ వేసుకోవాలని అనుకున్నా. అదే నన్ను ముందుకు నడిపిస్తుందని అనుకున్నాను. (Still I Rise) 'నేను మళ్లీ పైకి లేస్తా' అని దానికి అర్థం. అది నాకెంతో నచ్చిన టాటూ. అది నాలో ఎంతో ఇన్స్పిరేషన్ నింపింది.
- మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను జర్నీలో ఉన్నపుడు ఎక్కువగా సాంగ్స్ వింటుంటాను. కారు డ్రైవ్ చేస్తున్నా సరే, పాటలు వినాల్సిందే. లేకుంటే నేను ఓపిగ్గా నడపలేను. మ్యూజిక్ నన్ను ప్రశాంతంగా ఉంచుతుంది. నేను రోజూ భగవద్గీత చదువుతాను. నిద్రపోయే ముందు కూడా ఒక్క శ్లోకమైనా చదవడం 7-8 ఏళ్ల నుంచి నాకు అలవాటు. నేను కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతాను. మనం కష్టపడాలి, కానీ ఫలితం గురించి ఆలోచించకూడదని అనుకుంటా. అలాగే ధాన్యం కూడా చేస్తాను. ఒలింపిక్స్‌లో మూడు ఈవెంట్లలో పోటీ పడటం నామీద ప్రెజర్ పెంచలేదు. ఒకే సమయంలో మూడు ఈవెంట్ల కోసం ప్రాక్టీస్ చేశాను. అలాగే మెడిటేషన్ ఒత్తిడి పడకుండా చూశాయి.
- షూటింగ్ చాలా ఈజీ అని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. కొన్ని గంటల పాటు నిలబడి కాన్సన్ట్రేట్గా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. అందుకు శారీరక దృఢత్వం ఎంతో అవసరం. ఇందులో పెద్ద గాయాలైతే కావు కానీ, చిన్నపాటి గాయాలతో పోరాడాల్సి ఉంటుంది. అవి కూడా మన కెరీర్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. గత ఏడాది నా భుజ కండరాల్లో ఓ గాయమైంది. దాని వల్ల నేను చాలా ఇబ్బందిపడ్డాను. ఆ తర్వాత మోచేతి, మోకాలి, నడుం ఇలా పలు గాయాలు నన్ను ఇబ్బంది పెట్టాయి. శారీరక ఆరోగ్యం మానసిక ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది.
- వినేశ్ ఓ వారియర్. ఆమె తన కెరీర్లో చాలా విషయాలతో పోరాడింది. ఒలింపిక్స్‌లో రెండుసార్లు విఫలమైనప్పటికీ పట్టు వదల్లేదు. వెనుదిరిగే మనస్తత్వం ఆమెది కాదు. తన అనర్హత విషయంలో ఉన్న సాంకేతిక అంశాలు, పరిస్థితుల గురించి నాకు అంతగా తెలియదు. కానీ వినేశ్‌కు జరిగింది చూసి నాకు బాధ కలిగింది. ఆమె నా సోదరి లాంటిది. తనపై నాకు అమితమైన గౌరవం ఉంది. ఏ స్థితిలోనూ పోరాటం ఆపకూడదనే విషయాన్ని నేను తన నుంచే నేర్చుకున్నాను.