Major Sports Events In The World : ప్రపంచవ్యాప్తంగా క్రీడలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అత్యంత ప్రజాదరణ కలిగిన క్రీడలు అయిన ఫుట్‌బాల్, క్రికెట్, టెన్నిస్, బాడ్మింటన్, హాకీ, అథ్లెటిక్స్, చెస్ వాటికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. వీటికి ప్రతిష్టాత్మక టోర్నమెంట్లు సైతం నిర్వహిస్తారు. ఇక వాటిలో పాల్గొనేందుకు ప్రపంచ దేశాల నుంచి ఎంతోమంది క్రీడాకారులు తరలివస్తారు. అంతే కాదు వీటిని చూసేందుకు కూడా క్రీడా ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. ఈ నేపథ్యంలో వరల్డ్ వైడ్‌గా పాపులరైన కొన్ని మెగా టోర్నీల గురించి ఓ లుక్కేద్దామా.
ఒలింపిక్స్
క్రీడా రంగంలో ఒలింపిక్స్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రతి నాలుగు సంవత్సరాలకు ఓ సారి జరిగే ఈ మెగా టోర్నీలో అనేక రకాల క్రీడా పోటీలను నిర్వహిస్తారు. దాదాపు 200 దేశాలకు చెందిన ప్లేయర్లు ఈ పోటీల్లో పాల్గొంటారు. 1896లో మొట్టమొదటి సారిగా ఒలింపిక్స్ జరిగింది. ఇక రానున్న 2024 ఒలపింక్స్కు పారిస్ అతిథ్యం ఇవ్వనుంది. జులై 26 నుంచి మొదలయ్యే ఈ టోర్నీ ఆగస్టు 11 వరుకు జరగనుంది.
ఫిఫా వరల్డ్ కప్
ఫుట్‌బాల్ అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది ఫిఫా వరల్డ్ కప్. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఈ పోటీల్లో దాదాపు 100 దేశాలకు చెందిన టీమ్స్ ఈ మెగా ఈవెంట్లో పాల్గొంటాయి.
వన్డే క్రికెట్ వరల్డ్ కప్
క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు క్రేజ్ ఉన్నప్పటికీ వరల్డ్ కప్ మాత్రం వీటన్నింటిలో మరింత ప్రత్యేకత సంతరించుకుంది. నాలుగు సంవత్సరాలకు ఓ సారి ఈ టోర్నీని నిర్వహిస్తారు. చివరిసారిగా ఈ ప్రపంచకప్ పోటీలను భారత్‌లో జరిగింది. దీంతో పాటు టీ20 వరల్డ్ కప్ కోసం కూడా క్రీడాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. దీన్ని ప్రతి రెండేళ్ల ఒకసారి నిర్వహిస్తారు.