KL Rahul Lucknow Super Giants :గత కొంతకాలంగా ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించి ఆ జట్టులో కీలక పాత్ర పోషించిన కేఎల్ రాహుల్ ఈ సారి మెగా వేలంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అతడ్ని రిటైన్ చేసుకోవడానికి ఎల్‌ఎస్‌జీ ఆసక్తి చూపినప్పటికీ కేఎల్ రాహుల్ మాత్రం దానికి నో చెప్పినట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో లఖ్‌నవూ చిత్తుగా ఓడటం వల్ల లఖ్‌నవూ యజమాని సంజీవ్ గోయెంకా బహిరంగంగానే తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం వల్ల రాహుల్ కాస్త ఇబ్బంది పడ్డాడని, దీంతో ఆ ఫ్రాంఛైజీకి అతడు దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఎల్‌ఎస్‌జీని వీడినట్లు సమాచారం. అయితే ఈ సారి ఓ కొత్త ఫ్రాంఛైజీ తరఫున ఆడాలనకుంటన్నట్లు ఓ ప్రముఖ స్పోర్ట్స్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించాడు కేఎల్ రాహుల్.
తాజాగా ఆ ప్రోగ్రామ్‌కు సంబంధించిన ప్రోమో విడుదల కాగా, అందులో లఖ్‌నవూను వీడటానికి గల కారణాలను వెల్లడించాడు రాహుల్. తాను కొత్తగా ప్రారంభించాలనుకుంటున్నానని, తన ఆట ఆడేందుకు స్వేచ్ఛ అవసరమని అందుకే ఆ జట్టు నుంచి బయటికి వచ్చానంటూ రాహుల్ పేర్కొన్నాడు. జట్టు వాతావరణం కాస్త తేలిగ్గా ఉండి కొంతమేర స్వేచ్ఛగా లభించే టీమ్ తరఫున ఆడాలని ఉందంటూ తెలిపాడు.
మరోవైపు రాహుల్ గత కొంతకాలంగా భారత టీ20 జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇంటర్వ్యూలో దీని గురించి కూడా అతడు మాట్లాడాడు. "నేను కొంతకాలం నుంచి టీ20 జట్టుకు దూరంగా ఉన్నాను. ఓ ప్లేయర్‌గా నేనెక్కడ సరిపోతానో నాకు బాగా తెలుసు. అలాగే తిరిగి ఈ జట్టులోకి రావడానికి నేను ఏం చేయాలో కూడా తెలుసు. రాబోయే ఐపీఎల్ సీజనే దానికి వేదికగా భావిస్తున్నాను. మళ్లీ నేను జట్టులో స్థానం సంపాదించి నా క్రికెట్‌ను ఆస్వాదిస్తాను. భారత టీ20 జట్టులోకి కమ్‌బ్యాక్ ఇవ్వడమే నా గోల్" అని కేఎల్ రాహుల్ తెలిపాడు.