Jasprit Bumrah T20 World Cup 2024 :టీ20 వరల్డ్ కప్ 2024లో ఓటమెరుగకుండా దూసుకుపోతోంది రోహిత్ సేన. వరుసగా గ్రూపు స్టేజిను విజయాలతో ముగించడమే కాకుండా సూపర్-8 స్టేజిలోనూ అఫ్గనిస్థాన్‌పై ఘన విజయం సాధించి శుభారంభాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా పేసర్ బుమ్రా కీలకంగా వ్యవహరించడమే కాకుండా ఇదే వేదికగా ఓ నయా రికార్డు నెలకొల్పాడు.
తక్కువ పరుగులిచ్చి ఎక్కువ వికెట్లు పడగొట్టిన ఇండియన్ బౌలర్‌గా బుమ్రా రికార్డుకెక్కాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేసి ఏడు పరుగులే ఇవ్వడమే కాకుండా 3 వికెట్లు పడగొట్టాడు. గ్రూప్ దశలో యూఎస్ఏతో చెలరేగిన మరో టీమ్ఇండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌ను కూడా దాటేశాడు బుమ్రా. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ వేసిన అర్ష్‌దీప్ 4 వికెట్లు పడగొట్టడమే కాకుండా 9 పరుగులు సమర్పించుకున్నాడు.
టీమ్ఇండియా బౌలర్లు అయిన అర్ష్‌దీప్, బుమ్రాల మధ్య చక్కటి పోటీ నెలకొంది. అర్ష్‌దీప్ ఇప్పటికే 10 వికెట్లు పడగొడితే, బుమ్రా నాలుగు టీ20 వరల్డ్ కప్ 2024లో 8 వికెట్లు పడగొట్టాడు. ఇదే కాకుండా జస్ప్రిత్ బుమ్రా పేరిట మరో రికార్డు నమోదైంది. టీ20 వరల్డ్ కప్‌లలో వరుసగా 7-8 మ్యాచ్ లలో చక్కటి ఎకానమీ కనబరిచిన ప్లేయర్‌గా ఘనత సాధించాడు. బుమ్రా తర్వాతి స్థానంలో సఫారీ ప్లేయర్ డేల్ స్టెయిన్ ఆరు వరల్డ్ కప్ మ్యాచ్‌లతో నిలిచాడు టిమ్ సౌతీ.
వెస్టిండీస్‌లోని బార్బడోస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 8 వికెట్లు నష్టపోయి 181 పరుగులు చేయడం వల్ల చేధనలో తడబడింది అఫ్గాన్ జట్టు. నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 134 పరుగులతో ఆల్ అవుట్‌గా ఇన్నింగ్స్ ముగించింది. అయితే ఇలా టీమ్ఇండియా వరుస విజయాలను ఇప్పటికీ మూడు సార్లు నమోదు చేసింది.
టీమ్ఇండియా విజయాల లిస్ట్ ఇదే :
నవంబర్ 2021 - ఫిబ్రవరి 2022 మధ్య 12 మ్యాచ్‌లు
డిసెంబర్ 2020 - జనవరి 2020 మధ్య 9 మ్యాచ్‌లు
డిసెంబర్ 2023 - జూన్ 2024 మధ్య 8 మ్యాచ్‌లు.