ETV Bharat / sports

విజయ్​ దేవరకొండ నటించిన ఆ సినిమా అంటే ఇష్టం : ప్రపంచ చెస్ ఛాంపియన్‌ గుకేశ్ - GUKESH VIJAY DEVARKONDA MOVIE

తనకు ఇష్టమైన చిత్రాల గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ గుకేశ్‌.

Gukesh Favourite Movie
Gukesh Favourite Movie (source IANS And ETV Bharat)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 18, 2024, 6:27 PM IST

Gukesh Favourite Movie : ఇటీవల భారత యువ ప్లేయర్ డి గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అతి పిన్న వయసులోనే (18 ఏళ్లు) ఈ ఘనతను సాధించిన ఆటగాడిగా రికార్డుకు ఎక్కాడు. దీంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు తన ఇష్టాయిష్టాలు, అభిరుచుల గురించి మాట్లాడాడు. ఇందులో భాగంగా వీలు కుదిరినప్పుడు తాను సినిమాలు చూస్తుంటానని చెప్పాడు. తనకు ఇష్టమైన చిత్రాల గురించి తెలిపాడు.

"అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటాను. ఇష్టమైన మూవీస్​ చాలానే ఉన్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం అంటే చాలా ఇష్టం. తమిళంలో సూర్య నటించిన వారణం ఆయిరం (సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌ తెలుగు టైటిల్‌) చాలా బాగుంటుంది. హిందీలో ఆమిర్‌ ఖాన్‌ మూవీ జిందగీ నా మిలేగీ దోబారా కూడా ఇష్టం. హాలీవుడ్‌లో అయితే అబౌట్‌ టైమ్‌ ఇష్టం." అని గుకేశ్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం గుకేశ్ కామెంట్స్​ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే విజయ్‌ దేవరకొండ సినిమా గురించి గుకేశ్‌ మాట్లాడటంతో హీరో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా, చెన్నైకు చెందిన గుకేశ్‌, చైనాకు చెందిన డింగ్‌ లిరెన్‌ను ఓడించి చెస్‌ ఛాంపియన్‌గా టైటిల్‌ అందుకున్నాడు. "‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ అంటే కేవలం చెస్‌ మాత్రమే కాదు. ఎంతో మానసిక, భావోద్వేగ ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్యాడీ ఆప్టన్‌ (మెంటల్‌ కండీషనింగ్‌ కోచ్‌) పాఠాలు చాలా బాగా సాయపడ్డాయి. ఆ సూచనలు, అతనితో చర్చలు ఓ ప్లేయర్​గా నా పురోగతికి బాటలు వేశాయి" అని రీసెంట్​గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Vijay Devarkonda VD 12 Movie : ఇక విజయ్ దేవరకొండ సినిమా విషయానికొస్తే ప్రస్తుతం ఆయన హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శత్వంలో 'వీడీ 12' (వర్కింగ్‌ టైటిల్‌) అనే చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కేరళలో ఈ సినిమా షూటింగ్ సాగుతోంది.

రవిచంద్రన్ అశ్విన్ టాప్ 10 రికార్డ్స్​ ఇవే

కోహ్లీ, రోహిత్ కాదు - వరల్డ్​ చెస్ ఛాంపియన్ గుకేశ్ అభిమాన క్రికెటర్ ఎవరో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.