తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వెళ్లి గూగుల్​లో సెర్చ్ చేయండి, నా రికార్డ్ తెలుస్తుంది!'- రిపోర్టర్​కు బుమ్రా రిప్లై - BUMRAH GOOGLE RECORD

బుమ్రా టెస్టు రికార్డ్- గూగుల్​లో వెతకాలని రిపోర్టర్​కు సెటైర్!

Bumrah Record
Bumrah Record (Source : Associated Press)

By ETV Bharat Sports Team

Published : Dec 16, 2024, 6:36 PM IST

Bumrah Google Record :గబ్బా టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 445 పరుగులకు ఆలౌటైంది. జస్ప్రీత్ బుమ్రా 6 వికెట్లతో అదరగొట్టాడు. మూడో ఆట ముగిసే సమయానికి భారత్ 51-4 స్కోరుతో కష్టాల్లో ఉంది. క్రీజులో కేఎల్ రాహుల్ (33), రోహిత్ శర్మ (0) ఉన్నారు. అయితే మూడో రోజు ఆట ముగిసిన అనంతరం బుమ్రా విలేకరులతో మాట్లాడాడు. ఈ సందర్భంగా రిపోర్టర్ అడిగిన ఓ ప్రశ్నకు బుమ్రా ఇంట్రెస్టింగ్​గా సమాధానమిచ్చాడు.

గబ్బా మైదానంలో బ్యాటింగ్ పరిస్థితుల గురించి మీడియా నుంచి బుమ్రాకు ప్రశ్న ఎదురైంది. దీనికి బుమ్రా ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు. టెస్టుల్లో తన బ్యాటింగ్ రికార్డు గురించి గూగుల్‌లో సెర్చ్ చెయ్యాలని సరదాగా బదులిచ్చాడు. బుమ్రా ఇచ్చిన ఈ చమత్కారమైన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.

బుమ్రా- మీడియా సంభాషణ

మీడియా:'హాయ్, బుమ్రా. బ్యాటింగ్‌పై మీ అంచనా ఏమిటి? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పే వ్యక్తి మీరు కాదు. అయినప్పటికీ గబ్బాలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటే జట్టు పరిస్థితి (బ్యాటింగ్) గురించి మీరు ఏమని అనుకుంటున్నారు?'

బుమ్రా:'ఇది ఆసక్తికరమైన ప్రశ్న. కానీ, మీరు నా బ్యాటింగ్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఒకసారి గూగుల్​కు వెళ్లి, టెస్టుల్లో సింగిల్ ఓవర్​లో ఎక్కువ పరుగులు చేసింది ఎవరో వెతకండి. ఇది జోక్ మాత్రమే' అని రిప్లై ఇచ్చాడు. దీంతో అక్కడున్న జర్నలిస్టులు అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్​గా మారింది.

బుమ్రా రికార్డ్
అయితే బుమ్రా పేరిట అరుదైన రికార్డ్ ఉంది. టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసింది బుమ్రానే. 2022లో ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరిగిన ఐదో టెస్టులో అతడు ఈ ఘనత సాధించాడు. భారత్‌ స్కోర్ 377- 9 వద్ద బుమ్రా క్రీజ్‌లోకి వచ్చాడు. ఆపై స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్‌లో ఇక సింగిల్‌ సహా రెండు సిక్సర్లు (ఒకటి నోబాల్‌), 4 ఫోర్లు బాదాడు. మరోవైపు ఓ బంతి వైడ్‌గా వెళ్లి బౌండరీగా మారడం వల్ల టెస్టు క్రికెట్‌లో ఇదే అత్యంత ఖరీదైన ఓవర్‌ (మొత్తంగా 35 పరుగులు) గా నిలిచింది.

గబ్బా టెస్టు : బుమ్రా పాంచ్ పటాకా- అయినా రెండో రోజు ఆసీస్​దే!

'బుమ్రా ఎక్కువ వికెట్లు పడగొట్టినా షమినే టాప్ బౌలర్!'

ABOUT THE AUTHOR

...view details