Bumrah Test Wickets :బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో టీమ్ఇండియా బౌలర్ జస్ర్పీత్ బుమ్రా అదరగొట్టేస్తున్నాడు. మెల్బోర్న్ టెస్టులోనూ బుమ్రా ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే బుమ్రా టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. రెండో ఇన్నింగ్స్ 33.2 వద్ద ట్రావిస్ హెడ్ వికెట్ పడగొట్టిన బుమ్రా, 200 మార్క్ దాటాడు. అలాగే అత్యంత వేగంగా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న భారత బౌలర్‌గా నిలిచాడు. ఇక టెస్టుల్లో భారత్ తరఫున 200+ వికెట్లు పడగొట్టిన 12వ బౌలర్‌గా బుమ్రా నిలిచాడు.
బుమ్రా@ 200- తొలి భారత బౌలర్‌గా రికార్డ్- కెరీర్‌లో మరో ఘనత - BUMRAH TEST WICKETS
టెస్టుల్లో 200 వికెట్లు పూర్తి చేసిన బుమ్రా- కెరీర్‌లో అరుదైన రికార్డ్
Published : Dec 29, 2024, 9:37 AM IST
|Updated : Dec 29, 2024, 10:55 AM IST
కాగా, ఓవరాల్‌గా ఈ ఘనత అందుకున్న నాలుగో పేసర్ బుమ్రా కావడం విశేషం. అతడి కెరీర్‌లో 44వ టెస్టు ఆడుతున్న బుమ్రా, కేవలం 8,484 బంతుల్లోనే 200+ వికెట్ల మార్క్‌ను అందుకొన్నాడు. ఈ లిస్ట్‌లో పాక్ మాజీ పేసర్ వకార్ యూనిస్ 7,725 బంతుల్లో తీసి అగ్రస్థానంలో ఉన్నాడు. సౌతాఫ్రికా పేసర్లు డేల్ స్టెయిన్ (7,848), కగిసో రబాడ (8,153) తర్వాత స్థానాల్లో ఉన్నారు. అయితే, మ్యాచుల పరంగా స్పిన్నర్ అశ్విన్ (37 మ్యాచులు) భారత్ తరఫున ముందున్నాడు.
82-2 నుంచి 91-6
బుమ్రా, సిరాజ్ దెబ్బకు ఆసీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది. 82-2తో ఆసీస్ 4 ఓవర్ల వ్యవధిలోనే 91-6 కు చేరింది. బుమ్రా ఒక్కసారిగా రెచ్చిపోయాడు. స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ (1 పరుగులు), మిచెల్ మార్ష్ (0) ను ఒకే ఓవర్లో పెవిలియన్ చేర్చి భారత్‌కు మరోసారి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాచ వచ్చిన కెప్టెన్ కమిన్స్ పోరాడుతున్నాడు. టీ బ్రేక్ సమయానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో 139-6తో ఉంది.