ETV Bharat / sports

సిడ్నీ టెస్టుకు టీమ్ఇండియాలో​ భారీ మార్పులు- రోహిత్‌ ప్లేస్​లో గిల్- విజయంతో ముగిస్తారా? - IND VS AUS 5TH TEST

భారత్‌- ఆస్ట్రేలియా మధ్య చివరి టెస్టు శుక్రవారం సిడ్నీ వేదికగా ప్రారంభంకానుంది.

Ind vs Aus 5th Test
Ind vs Aus 5th Test (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 2, 2025, 6:35 PM IST

Ind vs Aus 5th Test : 2024 బోర్డర్- గావస్కర్ ట్రోఫీ చివరి దశకు చేరుకుంది. ఈ సిరీస్​లో ఆఖరిదైన ఐదో టెస్టు శుక్రవారం ప్రారంభం కానుంది. సిడ్నీ గ్రౌండ్ ఈ మ్యాచ్​కు వేదిక కానుంది. ఆతిథ్య ఆస్ట్రేలియా 1-2తో ఇప్పటికే సిరీస్​లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు టీమ్ఇండియా చివరి మ్యాచ్​లోనైనా నెగ్గి 2- 2తో సిరీస్​ను డ్రా చేసుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో తుది జట్టు విషయంలో మేనేజ్​మెంట్ కఠిన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది.

రోహిత్ దూరం!
పేలవమైన ఫామ్‌తో సతమతమౌతున్న టీమ్​ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టెస్టు కెరీర్‌ క్లైమాక్స్‌కు చేరినట్లే కనిపిస్తోంది. ఈ మ్యాచ్​లో రోహిత్‌ ఆడేది అనుమానంగా మారింది. పేలవమైన ఫామ్‌ కారణంగా రోహిత్‌ శర్మ చివరి టెస్టు నుంచి తప్పుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు బ్యాటర్‌గా, ఇటు కెప్టెన్‌గా రోహిత్‌ విఫలమవుతుండటమే అందుకు కారణం.

విరాట్‌ కోహ్లీ, శుభమన్‌ గిల్‌, KL రాహుల్‌, యశస్వీ జైశ్వాల్‌ నెట్స్‌లో ముమ్మర సాధన చేయగా ప్రాక్టీస్‌కు రోహిత్‌ చాలా ఆలస్యంగా రావడం గమనార్హం. అయితే శుక్రవారం ఉదయం పిచ్‌ను పరిశీలించాకే తుదిజట్టుపై నిర్ణయం తీసుకుంటామని టీమ్ఇండియా కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ ప్రకటించారు. రోహిత్‌ ఆడతాడా లేడా అనేదానిపై గంభీర్‌ సూటిగా సమాధానం ఇవ్వలేదు. ఒక వేళ సిడ్నీ టెస్టులో రోహిత్‌ ఆడకపోతే పేలవమైన ఫామ్‌ కారణంగా తుదిజట్టులో చోటు కోల్పోయిన తొలి భారత కెప్టెన్‌ రోహితే అవుతాడు.

ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో రోహిత్‌ కేవలం 31 పరుగులే చేశాడు. మహేంద్ర సింగ్‌ ధోనీ, అనిల్‌ కుంబ్లే కూడా టెస్టు సిరీస్‌ల మధ్యలోనే రిటైర్మెంట్‌ ప్రకటించాల్సి వచ్చింది. ఇప్పటికే రవిచంద్రన్ అశ్విన్‌ సిరీస్‌ మధ్యలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఒకవేళ రోహిత్‌ సిడ్నీ టెస్టులో ఆడకపోతే మెల్‌బోర్న్‌లో ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్టు మ్యాచే రోహిత్‌ కెరీర్‌లో ఆఖరి టెస్టు కానుంది.

గిల్ రీ ఎంట్రీ
సిడ్నీ టెస్టు కోసం శుభమన్‌ గిల్‌ మూడోస్థానంలో బరిలోకి దిగవచ్చని భావిస్తున్నారు. షాట్‌ సెలక్షన్‌ సరిగ్గా లేక విమర్శలు ఎదుర్కొంటున్న వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. వెన్నునొప్పితో బాధపడుతున్న ఆకాశ్‌ దీప్‌ స్థానంలో హర్షిత్‌ రాణా, ప్రసిద్ధ కృష్ణలో ఒకరికి తుదిజట్టులో చోటు దక్కవచ్చు. సిడ్నీటెస్ట్‌కు అప్పుడప్పుడు వరుణుడు అంతరాయం కలిగించే అవకాశం ఉంది.

పటిష్ఠంగా ప్రత్యర్థి
మరోవైపు ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. స్టీవ్‌ స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు కలిసివస్తోంది. ఈ సిరీస్‌లో పెద్దగా రాణించని మిచెల్‌ మార్ష్‌ స్థానంలో బ్యూ వెబ్‌స్టర్ తుదిజట్టులోకి వచ్చే అవకాశం ఉంది. చివరిటెస్టులో నెగ్గి సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకోవడం ద్వారా నేరుగా ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌కు అర్హత సాధించాలని ఆస్ట్రేలియా కోరుకుంటోంది.

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో 1-2తో వెనకంజలో ఉన్న భారత జట్టు సిరీస్‌ కోల్పోకుండా ఉండాలంటే సిడ్నీలో తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం టీమిండియాకు ఎంతో కీలకం. అంతేకాదు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే 2 టెస్టుల సిరీస్‌లో శ్రీలంక ఒక్కమ్యాచ్‌ కూడా ఓడిపోకుండా ఉండాలి.

సిడ్నీ టెస్టుకు రోహిత్ దూరం!- కెప్టెన్​గా ఎవరో మరి?

భారీ రికార్డుపై బుమ్రా కన్ను- 52ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.