తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముంబయి జట్టుకు ఆ స్టార్ క్రికెటర్ దూరం - పేస్​ దళానికి తీరనిలోటు! - Jason Behrendorff Mumbai Indians

Jason Behrendorff Mumbai Indians : ఐపీఎల్ సీజన్​ కోసం తీవ్ర కసరత్తులు చేస్తున్న తరుణంలో వరుసగా ఫ్రాంచైజీలకు షాక్​లు తగులుతోంది. తాజాగా గాయం కారణంగా స్టార్ పేసర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ టోర్నీకి దూరమయ్యాడంటూ ముంబయి జట్టు ప్రకటించింది. అయితే జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ దూరం ఆ జట్టుకు భారీ నష్టాన్ని చేకూర్చనుంది. ఎలాగంటే ?

Jason Behrendorff Mumbai Indians
Jason Behrendorff Mumbai Indians

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 7:55 PM IST

Jason Behrendorff Mumbai Indians :ఐపీఎల్ 2024 ఇంకా మొదలుకాలేదు. అప్పుడే గాయాలతో ప్లేయర్‌లు టోర్నీకి దూరమవుతున్న వార్తలు అభిమానులను కలవరపెడుతున్నాయి. గాయాలతో ఐపీఎల్‌ 17 సీజన్‌కి దూరమవుతున్న లిస్టులో ముంబయి ఇండియన్స్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్ జాసన్ బెహ్రెన్‌డార్ఫ్ కూడా చేరాడు. ట్రైనింగ్‌ సెషన్‌లో భాగంగా నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్యాడ్స్‌ తప్పించుకున్న బాల్‌ నేరుగా అతడి ఎముకకు తగిలింది. ఎడమ కాలి పాదానికి పైన, మోకాలికి బాగా దిగువన తగలడంతో ఎముక (ఫిబులా) విరిగింది. దీంతో ఐపీఎల్‌ నుంచి అతడు తప్పుకున్నాడు.

గత సీజన్‌లో జస్త్రీత్‌ బుమ్రా, జోఫ్రా ఆర్చర్‌ కూడా గాయాలతో ముంబయికి దూరమైన సంగతి తెలిసిందే. అప్పుడు బెహ్రెన్‌డార్ఫ్ పేస్‌ దళాన్ని ముందుకు నడిపించాడు. అనుభవం లేని ఆకాశ్ మధ్వల్, అర్జున్ తెందూల్కర్, క్రిస్ జోర్డాన్‌కి నాయకత్వం వహించాడు. అయితే ఈ సారికి పేస్ బౌలింగ్ విభాగాన్ని మెరుగు పరుచుకున్నా బెహ్రెన్‌డార్ఫ్‌ లోటు తీర్చలేనిదంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం బెహ్రెన్‌డార్ఫ్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. టీ20 ఫార్మాట్‌లో ఆస్ట్రేలియా టీ20 'ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు' కూడా అందుకున్నాడు. బిగ్​ బాష్ లీగ్​ సీజన్‌లోనూ పెర్త్ స్కార్చర్స్ తరఫున రాణించాడు. ఈ రేంజ్‌ ఫామ్‌లో ఉన్నప్పుడు ముంబయి ఇండియన్స్‌కి దూరమవ్వడం ఆ జట్టుకు నష్టమే ఎందుకంటే ?

పవర్‌ప్లే స్ట్రైక్ బౌలర్
బెహ్రెన్‌డార్ఫ్ అతిపెద్ద బలం కొత్త బంతిని స్వింగ్ చేయగల సామర్థ్యం. ​​ముఖ్యంగా వాంఖడే స్టేడియంలో, పవర్‌ప్లే ఓవర్లలో ముంబయి ఇండియన్స్‌కు అతను బెస్ట్‌ ఆప్షన్‌గా మారాడు. మూవ్‌మెంట్, బౌన్స్‌తో రైట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌లకు పరీక్ష పెడతాడు. గత సీజన్‌లో పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు పడగొట్టి ముంబయికి శుభారంభాలు అందించాడు. ఇప్పుడు బెహ్రెన్‌డార్ఫ్‌ లేకపోవడం వల్ల జస్ప్రీత్ బుమ్రాపై ఎక్కువ భారం పడుతుంది. దీంతో డెత్ ఓవర్లలో టీమ్‌కి బౌలింగ్‌ ఆప్షన్లు తగ్గుతాయి. గత సీజన్‌లో ఆకాష్ మధ్వల్ లాస్ట్‌ ఓవర్స్‌లో చక్కగా బౌలింగ్‌ చేసినా, అతనికి ఎక్కువ అనుభవం లేదు.

ముంబయి బౌలర్‌లకు గాయాల బెడద
ముంబయి లెఫ్ట్ ఆర్మ్‌ పేస్‌ బౌలింగ్‌ ఆప్షన్‌గా ఉన్న శ్రీలంక ఆటగాడు దిల్షాన్ మధుశంక గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో అతనికి గాయమైంది. ఐపీఎల్‌ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చు. దక్షిణాఫ్రికాకు చెందిన గెరాల్డ్ కోయెట్జీది కూడా అదే పరిస్థితి. ఈ రైట్ ఆర్మ్ స్పీడ్‌స్టర్ చివరిసారిగా 2023 చివరలో భారత్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో కనిపించాడు.

పెల్విక్ ఇన్‌ఫ్లమేషన్ సమస్య కారణంగా కేప్ టౌన్‌లో జరిగిన రెంటో టెస్టు నుంచి తప్పుకున్నాడు. బుమ్రా ఫిట్‌గా ఉన్నప్పటికీ, మంచి రిథమ్‌లో బౌలింగ్ చేస్తున్నప్పటికీ, 2024 టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని అతని పనిభారాన్ని నిరంతరం మానిటర్‌ చేయవచ్చు.

స్ట్రాటజీలు మార్చాల్సిందే
బెహ్రెన్‌డార్ఫ్ ముంబయి ఇండియన్స్‌కి ఎక్స్‌పీరియన్స్‌, స్కిల్‌, వర్సెటాలిటీ తీసుకొచ్చాడు. ఐపీఎల్ పరిస్థితులు, టీ20 క్రికెట్‌లో అతని ట్రాక్ రికార్డ్ అతన్ని నమ్మకమైన ఆప్షన్‌గా నిలుపుతాయి. ఇలాంటి ప్లేయర్‌కి రీప్లేస్‌మెంట్‌గా ఇంగ్లాండ్ పేసర్‌ ల్యూక్‌ వుడ్‌ని తీసుకున్నారు. కానీ ముంబయి ఇండియన్స్ తమ బౌలింగ్ స్ట్రాటజీలను పునః పరిశీలించాలి. మధుశంక, ల్యూక్ వుడ్, అర్జున్ టెండూల్కర్ వంటి ప్రత్యామ్నాయాలు బెహ్రెన్‌డార్ఫ్ నైపుణ్యానికి సాటిరావు.

ABOUT THE AUTHOR

...view details