Ishan Iyer Central Contract:టీమ్ఇండియా యంగ్ బ్యాటర్లు ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు రిస్క్‌లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ జట్టుకు ఆడని సమయంలో డొమెస్టిక్ టోర్నీల్లో పాల్గొనాలని బీసీసీఐ ఎన్నిసార్లు సూచించినా ఇషాన్, అయ్యర్ వాటిని పట్టించుకోవడం లేదు. ఎలాంటి కారణాలు లేకుండా రంజీలో ఆడకపోవడం వల్ల వీరిపై బీసీసీఐ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బోర్డు వీరి సెంట్రల్ కాంట్రాక్ట్‌లు రద్దు చేయాలని భావిస్తోందట.
అయితే బీసీసీఐ ప్రతిఏటా సెంట్రల్ కాంట్రాక్ట్‌ల జాబితా రిలీజ్ చేస్తుంటుంది. అందులో A+, A, B, C కేటగిరీల వారిగా ఆటగాళ్లను ఆయా గ్రూపుల్లో చేర్చి వారికి శాలరీ ఇస్తుంటుంది. కాగా, 2023-24కు సంబంధించి ప్లేయర్ల కాంట్రాక్ట్ లిస్ట్ ఇప్పటికే పూర్తయ్యిందంట. త్వరలోనే ఈ లిస్ట్‌పై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఈ లిస్ట్‌లో ఇషాన్, అయ్యర్ పేర్లను బీసీసీఐ తొలగించినట్లు సమాచారం. కాగా, గతేడాది లిస్ట్‌లో అయ్యర్ B కేటగిరీలో, ఇషాన్ C కేటగిరీలో స్థానం దక్కించుకున్నారు.
అయితే టీమ్ఇండియాకు దూరంగా ఉన్న ప్లేయర్లంతా డొమెస్టిక్ క్రికెట్లో ఆడాల్సిందేనని బీసీసీఐ చెప్పింది. అప్పుడే వారిని మళ్లీ జాతీయ జట్టు ఎంపికకు పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఫిట్‌గా లేని ప్లేయర్లకు మాత్రమే మినహాయింపు ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు పలుమార్లు ఆయా ప్లేయర్లను హెచ్చరించినా పట్టించుకోవట్లేదు. దీంతో ఈ విషయం కొన్ని రోజుల నుంచి చర్చనీయాంశమైంది.