తెలంగాణ

telangana

ETV Bharat / sports

13 ఏళ్ల వైభవ్‌ ఐపీఎల్‌ ఆడొచ్చా? - రూల్స్ ఏం చెబుతున్నాయంటే? - IPL 2025 VAIBHAV SURYAVANSHI

ఐపీఎల్‌ మెగా వేలంలో రూ.1.10 కోట్లకు అమ్ముడైన 13 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ ఈ మెగా లీగ్​ ఆడేందుకు అర్హుడేనా?

IPL 2025 Youngest Player Vaibhav Suryavanshi
IPL 2025 Youngest Player Vaibhav Suryavanshi (source ETV Bharat)

By ETV Bharat Sports Team

Published : Nov 27, 2024, 8:36 AM IST

IPL 2025 Youngest Player Vaibhav Suryavanshi : ఐపీఎల్‌ 2025 మెగా వేలంలో 13 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ అమ్ముడుపోయి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. వేలంలో అమ్ముడుపోయిన అతిపిన్న వయస్సు ప్లేయర్​గా రికార్డుకు ఎక్కాడు. బీహార్‌కు చెందిన ఈ టీనేజ్​ కుర్రాడు రూ.1.10 కోట్లకు అమ్ముడుపోవడం విశేషం. దిల్లీ క్యాపిటల్స్​తో పోటీ పడి మరీ అతడిని రాజస్థాన్‌ రాయల్స్‌ కొనుగోలు చేసింది. అయితే ఇప్పుడు క్రికెట్ అభిమానుల్లో ఓ ప్రశ్న మెదులుతోంది.

అదేంటంటే? -13 ఏళ్ల వయసున్న వైభవ్ సూర్యవంశీ(Rajasthan Royals) ఐపీఎల్‌లో ఆడేందుకు అర్హుడేనా? అసలు ఐపీఎల్​లో ఆడేందుకు వయసు నిబంధన ఏమైనా ఉందా? అనే ప్రశ్న ఎదురౌతోంది. అయితే ఐపీఎల్‌లో అధికారికంగా ఆడేందుకు కనీస వయసు నిబంధన అంటూ ఏమీ లేదు. ఆటగాళ్ల సంసిద్ధత పై డెసిషన్ తీసుకునే అవకాశాన్ని ఫ్రాంచైజీలకే వదిలేశారు.

వైభవ్‌ సూర్యవంశీ వయసు ప్రస్తుతం 13 సంవత్సరాల 8 నెలలు. ఐపీఎల్‌ 2025 సీజన్‌ ప్రారంభమయ్యే సరికి 14 ఏళ్లు పూర్తి చేసుకుంటాడు. కానీ వచ్చే సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్​ వైభవ్​ను ఆడించే అవకాశాలు చాలా తక్కువే. కానీ, రాజస్థాన్‌ కోచింగ్‌ టీమ్​లో రాహుల్ ద్రవిడ్, కుమార సంగక్కర వంటి దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. వాళ్లతో డ్రెస్సింగ్‌ రూమ్‌ షేర్ చేసుకోవడం వైభవ్‌ కెరీర్‌కు ఎంతగానో ఉపయోగపడొచ్చు.

అంతర్జాతీయ క్రికెట్‌లో నిబంధనలు ఎలా ఉన్నాయంటే?

ఇంటర్నేషనల్​ క్రికెట్‌లో ఆడటానికి కనీస వయసు నిబంధన అనేది ఒకటి ఉంది. అంతర్జాతీయ స్థాయిలో మ్యాచ్‌లు ఆడాలంటే ప్లేయర్స్​కు కనీస వయసు 15 ఏళ్లు ఉండాలి. 2020లో ఈ రూల్​ అమలులోకి వచ్చింది. ఐసీసీ దాన్ని తీసుకు వచ్చింది. అయితే, అసాధారణమైన సందర్భాల్లో మాత్రం క్రికెట్ బోర్డులు 15 ఏళ్ల లోపు ప్లేయర్స్​ను తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ప్రత్యేక అనుమతిని తీసుకోవాలి. ఐసీసీ నుంచి ఆ పర్మిషన్​ను పొందాలి.

గతంలో పాక్ ప్లేయర్​ హసన్ రజా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు ఎక్కాడు. అప్పుడు 14 సంవత్సరాల 227 రోజుల వయసులో టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటికీ ఐసీసీ కనీస వయసు నిబంధనలు పెట్టలేదు. హసన్ రాజా 1996 - 2005 మధ్య పాకిస్థాన్‌ తరఫున ఏడు టెస్టులు, 16 వన్డేలు ఆడాడు.

బిగ్​బాస్​ బ్యూటీతో సిరాజ్! - లైక్ కొడితే ప్రేమలో పడినట్టేనా?

అన్నను వద్దన్నారు, తమ్ముడిని తీసుకున్నారు! - రంజీల్లో రాణించినా అతడికి నో ఛాన్స్!

ABOUT THE AUTHOR

...view details