తెలంగాణ

telangana

ETV Bharat / sports

IPL 2025 అప్డేట్- ఈసారి టోర్నీ 2 నెలలకు పైనే! - IPL 2025

ఐపీఎల్ విండో రిలీజ్- మార్చిలోనే ప్రారంభం- మే లో ఫైనల్

IPL 2025
IPL 2025 (Source : ETV Bharat)

By ETV Bharat Sports Team

Published : Jan 12, 2025, 6:08 PM IST

IPL 2025 :2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్​కు సంబంధించి కీలక అప్డేట్‌ వచ్చింది. ఈ సీజన్ మార్చి 23 నుంచి ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. సుమారు 65 రోజుల పాటు సాగనున్న ఈ టోర్నీలో మే 25న ఫైనల్‌ మ్యాచ్ ఉంటుందని తెలిపారు. బీసీసీఐ ప్రత్యేక సాధారణ సమావేశం ఆదివారం ముంబయిలో జరిగింది.

ఈ క్రమంలోనే రాజీవ్ శుక్లా 2025 ఐపీఎల్ విండో ఫైనలైజ్ చేసినట్లు తెలిపారు. కాగా, పూర్తి స్థాయి షెడ్యూల్‌ రిలీజ్ అయ్యేందుకు మరికొంత సమయం పడుతుంది. ఫిబ్రవరి నెలలో ఫుల్ షేడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details