తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీమ్​ఇండియా రిచెస్ట్​ క్రికెటర్​గా పంత్​ - కోహ్లీ, రోహిత్​ను వెనక్కినెట్టి! - సంపాదనో ఎంతంటే? - PANT HIGHEST PAID INDIAN CRICKETER

భారత ప్లేయర్లలో అత్యధిక వార్షిక పారితోషికం అందుకుంటున్న పంత్ - కోహ్లీ, రోహిత్ దాటేసిన యంగ్ ప్లేయర్.

Pant Highest Paid Indian Cricketer
Pant Highest Paid Indian Cricketer (source Associated Press and AFP)

By ETV Bharat Sports Team

Published : Nov 29, 2024, 1:13 PM IST

Pant Highest Paid Indian Cricketer : తాజాగా జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో యంగ్ బ్యాటర్ రిషభ్ పంత్ అత్యధిక ధర పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. లఖ్​నవూ సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ పంత్​ను ఏకంగా ను రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. తద్వారా భారత క్రికెట్​లో టీమ్ ఇండియా దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కన్నా పంత్ ఎక్కువ వార్షిక పారితోషికం తీసుకుంటున్న ప్లేయర్​గా నిలిచాడు.

రోహిత్, కోహ్లీని దాటేసిన పంత్

పంత్​కు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లఖ్​నవూ నుంచి రూ.27 కోట్లు వస్తాయి. అలాగే బీసీసీఐతో పంత్​కు గ్రేడ్ బీ ఒప్పందం ఉంది. దానికి మరో రూ.3 కోట్లు లభిస్తాయి. దీంతో ఏకంగా పంత్ రూ.30 వార్షిక పారితోషికాన్ని పొందుతాడు. ఈ క్రమంలో విరాట్, రోహిత్ కన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ పొందుతున్న ప్లేయర్​గా పంత్ అవతరిస్తాడు.

బీసీసీఐ గ్రేడ్ బీ కాంట్రాక్టు పొందిన పంత్

రోడ్డు ప్రమాదానికి గురై గాయపడిన తర్వాత పంత్​కు బీసీసీఐ గ్రేడ్ బీ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఆ తర్వాత అతడు పుంజుకుని దేశం తరఫున అన్ని ఫార్మాట్లలోనూ రాణిస్తున్నాడు. ఈ క్రమంలో పంత్ తదుపరి బీసీసీఐ కాంట్రాక్ట్​లో గ్రేడ్ A+ లేదా గ్రేడ్ A కేటగిరీకి పదోన్నతి పొందొచ్చు. అప్పుడు బీసీసీఐ నుంచి రూ. 7 కోట్లు అందుతాయి.

కోహ్లీ, రోహిత్ రెమ్యూనరేషన్ పారితోషికం ఎంతంటే?

టీమ్ ఇండియా క్రికెటర్లు కోహ్లీ, రోహిత్ శర్మకు 2023-24 సీజన్ కోసం బీసీసీఐ A+ గ్రేడ్ కాంట్రాక్ట్‌ ఇచ్చింది. దీంతో ఒక్కొక్కరికి ఏటా రూ.7 కోట్లు లభిస్తుంది. ఐపీఎల్ మెగా వేలానికి ముందు కోహ్లీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రూ. 21 కోట్లకు, రోహిత్​ను రూ. 16.3 కోట్లకు ముంబయి ఇండియన్స్ అట్టిపెట్టుకుంది.

టాప్​లో రిషభ్ పంత్

కాగా, బీసీసీఐ, ఐపీఎల్ ద్వారా వచ్చిన ఆదాయం కలిపినా కోహ్లీకి రూ.28 కోట్ల పారితోషికమే అవుతుంది. రోహిత్ కు రూ.23.3కోట్లే వస్తుంది. దీంతో పంత్ కన్నా వీరిద్దరూ వెనకపడ్డారు. దీంతో పంత్ ప్రస్తుతం టీమ్ ఇండియాలోనే అత్యధిక వార్షిక పారితోషికం అందుకుంటున్న క్రికెటర్​గా నిలిచాడు.

రూ. 27 కోట్లు కాదు! - ఐపీఎల్ రెమ్యూనరేషన్​లో పంత్​కు వ‌చ్చేది ఎంతంటే?

మ్యాచ్​ ఆడుతూ కుప్పకూలిన క్రికెటర్ - గుండెపోటుతో అక్కడికక్కడే మృతి

ABOUT THE AUTHOR

...view details