తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్ ఫ్యాన్స్​కు బిగ్ న్యూస్- IPL రిటెన్షన్స్​ లైవ్ స్ట్రీమింగ్​- డీటెయిల్స్ ఇవే!

ఐపీఎల్ రిటెన్షన్ షో- స్పెషల్ ప్రోగ్రామ్​కు బీసీసీఐ ప్లాన్- లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

IPL 2025 Retention show
IPL 2025 Retention show (Source: ETV Bharat)

By ETV Bharat Sports Team

Published : 4 hours ago

IPL 2025 Retention show :2025 ఐపీఎల్ రిటైన్షన్స్​కు గడువుకు సమయం దగ్గర పడుతోంది. అక్టోబర్ 31 సాయంత్రం 5.00 వరకు అన్ని ఫ్రాంచైజీలు వాళ్లు అట్టిపెట్టుకునే ప్లేయర్ల లిస్ట్​ను అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని జట్టు రిటెన్షన్స్​పై ఓ క్లారిటీకి వచ్చాయి. ఇప్పటికే రిటైన్ చేసుకునే ప్లేయర్ల లిస్ట్​ కూడా రెడీ చేసుకున్నాయి. అయితే ఏ జట్టు ఏయే ప్లేయర్లను అట్టిపెట్టుకుంది? ఎవరెవరిని వదులుకుంది? మెగా వేలంలోకి రానున్న స్టార్ ప్లేయర్లు ఎవరు? అనే దానిపై ఐపీఎల్ లవర్స్​ ఆత్రుతగా ఉన్నారు.

అయితే ఐపీఎల్ మెగా వేలం మాత్రమే కాదు, ఈ రిటెన్షన్స్​ కూడా లైవ్​లో ప్రసారం కానున్నాయి. 'రిటెన్షన్ షో' పేరిట ఐపీఎల్ నిర్వాహకులు స్పెషల్ ప్రోగ్రామ్​ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని జట్లు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల లిస్ట్​ను లైవ్​లో చూసి ఎంజాయ్ చేయవచ్చు. ప్రముఖ ఓటీటీ ప్లాట్​ఫామ్​ జియో సినిమాలో అక్టోబర్ 31 సాయంత్రం 4.30 గంటలకు ఈ రిటెన్షన్ షో ప్రారంభం కానుంది. అలాగే స్టార్ స్పోర్ట్స్ నెట్​వర్క్​ ఛానెళ్లలో బ్రాడ్​కాస్టింగ్ కూడా జరగనుంది. దీంతో క్రికెట్ ఫ్యాన్స్​ ఎంతో ఆత్రుతగా ఈ ప్రోగ్రామ్​ కోసం ఎదురుచూస్తున్నారు. కాగా, 2025 మెగా వేలం నవంబర్ ఆఖరి లేదా డిసెంబర్ తొలి వారంలో జరగనున్నట్లు తెలుస్తోంది.

ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ప్లేయర్లు (అంచనా*)

ముంబయి ఇండియన్స్​ రిటెన్షన్స్ 2025

  • రోహిత్ శర్మ
  • సూర్యకుమార్ యాదవ్
  • తిలక్ వర్మ
  • జస్ప్రీత్ బుమ్రా
  • హార్దిక్ పాండ్య

చెన్నై సూపర్ కింగ్స్​ రిటెన్షన్స్​ 2025

  • రవీంద్ర జడేజా
  • రుతురాజ్ గైక్వాడ్
  • శివం దూబే
  • ఎంఎస్ ధోని
  • డెవాన్ కాన్వే
  • మతీషా పతిరన

సన్​రైజర్స్ హైదరాబాద్​ రిటెన్షన్స్ 2025

  • హెన్రిచ్ క్లాసెన్
  • పాట్ కమిన్స్
  • అభిషేక్ శర్మ
  • ట్రావిస్ హెడ్
  • నితీశ్​ కుమార్ రెడ్డి

రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్స్ 2025

  • విరాట్ కోహ్లీ
  • మహ్మద్ సిరాజ్

కోల్​కతా నైట్​రైడర్స్​ రిటెన్షన్స్ 2025

  • రింకూ సింగ్
  • ఆండ్రీ రస్సెల్
  • సునీల్ నరైన్
  • హర్షిత్ రానా

రాజస్థాన్ రాయల్స్ రిటెన్షన్స్ 2025

  • సంజూ శాంసన్
  • యశస్వీ జైస్వాల్
  • రియాన్ పరాగ్

దిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్స్ 2025

  • అక్షర్ పటేల్
  • కుల్దీప్ యాదవ్
  • అభిషేక్ పోరెల్

గుజరాత్ టైటాన్స్​ రిటెన్షన్స్ 2025

  • శుభ్​మన్ గిల్
  • రషీద్ ఖాన్

లఖ్​నవూ సూపర్ జెయింట్స్​ రిటెన్షన్స్ 2025

  • నికోలస్ పూరన్
  • మయాంక్ యాదవ్

పంజాబ్ కింగ్స్​ రిటెన్షన్స్ 2025

  • శశాంక్ సింగ్
  • అశుతోష్ శర్మ

గుజరాత్ రిటెన్షన్ లిస్ట్ రెడీ- ఫ్రాంచైజీ ఓనర్ల మొగ్గు ఆ ప్లేయర్లకే!

ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకునే ప్లేయర్లు వీళ్లేనా? - అందరి చూపు ముంబయి, చెన్నై వైపే! - IPL 2025 All Teams Retentions

ABOUT THE AUTHOR

...view details